మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ తో రీజనల్ స్థాయి నుంచి నేషనల్ స్థాయికి చేరింది. ఇప్పుడా క్రేజ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకే తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆర్ సీ -15 శంకర్ తో చేస్తోన్న 16వ సినిమా విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.
బాలీవుడ్..హాలీవుడ్ ఆఫర్లు వచ్చినా? వాటిలో ది బెస్ట్ ఏంటి? అని ఆలోచించే స్థాయిలో పరణితి కనిపిస్తుంది. నటుడిగా కొత్తగా నేనేం చేయగలను? ప్రేక్షకుల మనసులకు దగ్గరవ్వాలంటే తాను ఇంకెంతగా మారాల్సి ఉంటుంది? వంటి విషయాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో దొరికిన రిలేషన్స్ షిప్స్ వేటిని వదిలిపెట్టడం లేదు.
తాజాగా చరణ్ వైఖరిని గమనిస్తే..బాలీవుడ్ స్టార్ హీరోలతో మంచి ర్యాపోని మెయింటెన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో చరణ్ కి మంచి స్నేహం ఉంది. కొన్నేళ్లగా ఇద్దరి మధ్య మంచి ప్రెండ్ షిప్ కొనసాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' లో సల్మాన్ నటించారంటే దానికి ప్రధాన కారణం చరణ్ అన్న సంగతి తెలిసిందే.
అతను ఫోన్ చేయగానే మరో మాట లేకుండా సల్మాన్ నటించి వెళ్లిపోయారు . అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చరణ్ కి తండ్రి పాత్రలో అజయ్ దేవగణ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లో ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ లేనప్పటికీ సెట్స్ లో ఉన్నన్ని రోజులు సన్నిహితంగా మెలిగారు. అప్పటి నుంచి చరణ్ కి....అజయ్ మంచి స్నేహితుడిగా మారిపోయారు.
అదే బాండింగ్ ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. చరణ్ ముంబై వెళ్లినప్పుడు కలవడం..మాట మంతి చేయడం లాంటివి చేస్తున్నారు. అలాగే మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ తోనూ ఇటీవల ప్రెండ్ షిప్ మొదలైంది. చిరంజీవి..నాగార్జునలతో ఎప్పటి నుంచి అమీర్ కి మంచి స్నేహం ఉంది. ఆ కారణంతో చరణ్ కూడా స్నేహితుడిగా మారిపోయారు.
'లాల్ సింగ్ చడ్డా' హైదరాబాద్ ప్రమోషన్ సమయంలో బ్యాకెండ్ అమర్ కి ఎంతగానో చరణ్ సహకరించారు. తాజాగా చరణ్ ఢిల్లీ టూర్ లో భాగంగా ఏకంగా అక్షయ్ కుమార్ తో కలిసి ఓ పాటకి స్టెప్పునే పంచుకున్నారు. ఇద్దరు కలిసి వేదికపై డాన్స్ చేసారు. ఆ రకంగా చరణ్ బాలీవుడ్ లో ప్రతీ హీరోతోనూ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. సందర్భాన్ని బట్టి వ్యక్తిగత పార్టీలకు హాజరవుతున్నట్లు సమయాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.