క‌మ‌ల్ కంటే ముందే చ‌ర‌ణ్ క‌ర్పీచ్ వేసాడా?

Update: 2022-07-11 02:30 GMT
కోలీవుడ్ సంచ‌న‌లం యంగ్ మేక‌ర్ లోకేష్ క‌న‌గరాజ్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ ఫేమ‌స్  అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా త‌మిళ్ లోనే చేసినా `ఖైదీ`..`విక్ర‌మ్` సినిమాల‌తో అసాధార‌ణ‌మైన క్రియేటివిటీ బ‌య‌ట‌ప‌డింది. అదొక్క‌టే లోకేష్ కి అన్ని భాష‌ల్లోనూ గుర్తింపును తీస‌కొచ్చింది. కెరీర్ ఆరంభంలోనే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నే డైరెక్ట్ చేసే స్థాయికి ఎద‌గ‌డం నిజంగా ప్ర‌శంస‌నీయం.

అయితే లోకేష్  ప్ర‌తిభ‌ని క‌మ‌ల్ కంటే ముందుగానే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప‌సిగ‌ట్టారా? అంటే అవున‌నే ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తుంది. విక్ర‌మ్ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ -క‌న‌గ‌రాజ్ తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. అయితే అంత‌కు ముందు నుంచే చ‌ర‌ణ్  క‌న‌గ‌రాజ్ ని లైన్ లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. `ఖైదీ` రిలీజ్ ద‌గ్గ‌ర నుంచి  లోకేష్ కి చర‌ణ్ ట‌చ్ లో  ఉంటున్నాడుట .

విజ‌య్ తో తెర‌కెక్కించిన‌  `మాష్ట‌ర్` సినిమా టైమ్ లోనే చ‌ర‌ణ్ లోకేష్ ని నేరుగా క‌లిసారుట‌. అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయని స‌మాచారం. ఇరువురి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్ ఆనాడే జ‌రిగిందిట‌. కానీ  ఇద్ద‌రి బిజీ షెడ్యూల్ కార‌ణంగా ప్రాజెక్ట్ డిలే అవుతుంద‌ని తాజా లీకుల్ని బ‌ట్టి తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా నిర్మించ‌డానికి కోలీవుడ్  నిర్మాణ సంస్థ‌ యూనివ‌ర్శ్ సినిమాస్ ముందుకొచ్చిందిట‌.

అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ఆ సంస్థ ఆస‌క్తి  చూపిస్తుందిట‌. ఈ నిర్మాణ సంస్థతో టై అప్ బాద్య‌త‌లు మొత్తం లోకేష్ తీసుకున్నారుట‌. ఆయ‌నే  ద‌గ్గ‌రుండి ప్రాజెక్ట్ ని సెట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే లోకేష్‌-చ‌ర‌ణ్‌--యూనివ‌ర్శ్ సినిమాస్ అధినేత‌ల మ‌ధ్య ఓ స‌మావేశం జ‌రిగింద‌ని స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సంస్థ ఇతర నిర్మాణ సంస్థ‌ల్లో కేవ‌లం భాగ‌స్వామిగానే కొన‌సాగిందిట‌.

తొలిసారి చ‌ర‌ణ్ సినిమాతోనే అధికారికంగా  లాంచ్ అవుతున్న‌ట్లు లీకుంలందుతున్నాయి. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? అన్న‌ది అధికారికంగా వెల్ల‌డిస్తే గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం చర‌ణ్ -శంక‌ర్ తో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్త‌యిన వెం ట‌నే `జెర్సీ` ఫేం గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. మ‌రి తాజాగా లోకేష్ ఎంట‌ర్ అయ్యాడు కాబ‌ట్టి గౌత‌మ్ ని హోల్డ్  పెడ‌తారా? అని కొత్త డౌట్  మీడియాలో  రెయిజ్ అవుతోంది.
Tags:    

Similar News