రెట్రో లుక్.. ఇది మనకు కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పేరుతో రెట్రో డేస్ ని .. ఓల్డ్ క్లాసిక్ గెటప్పుల్ని పరిచయం చేస్తున్నారు. కథానాయకుడు లేదా కథానాయిక ఫ్లాష్ బ్యాక్ డేస్ రెట్రో స్టైల్ తో మురిపిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు సరికొత్తగా రెట్రో లుక్ లోకి ఛేంజ్ అవుతున్నారు. తాజాగా ట్విట్టర్ లో తన రెట్రో ఫోటో వైరల్ కావడంతో నెటిజనుల్లో చర్చ సాగుతోంది. చరణ్ ఈ కొత్త మేకోవర్ దేనికోసం అంటే నిస్సందేహంగా శంకర్ తో చేస్తున్న ఆర్.సి15 ప్రాజెక్ట్ కోసం అని అర్థమవుతోంది.
అతడి కొత్త రూపం అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా లుక్ లో.. వైట్ టీ షర్ట్ - బ్లాక్ ప్యాంటుతో చరణ్ రెట్రో హెయిర్ స్టైల్ లో కనిపించాడు. తలకట్టును పక్కపాపిడి తీసాడు. వెంట్రుకలు ఉంగరాలతో స్పెషల్ లుక్ కనిపిస్తోంది. RC15లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇటీవల వచ్చిన కథనాల్లో నిజం ఉందని దీనిని బట్టి కన్ఫామ్ చేయొచ్చు.
ఈ రెట్రో లుక్ కోసమే చరణ్ తన జుట్టును పెంచుతున్నట్లు సమాచారం. అతడు స్పెషల్ మీసకట్టుతో మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం మూవీ షూటింగ్ రాజమండ్రిలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో జయరామ్- అంజలి- సునీల్- నవీన్ చంద్ర- రెహమాన్- శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
RC15 చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా 400 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నారన్న టాక్ ఉంది. చరణ్ ఈ చిత్రంలో ఐఏఎస్ టర్న్ డ్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారని లీకులు అందాయి.
#RC15 బిజినెస్ క్రేజు అదుర్స్
ఆర్.సి 15 చరణ్ కెరీర్ లో మరో పాన్ ఇండియా మూవీ. చరణ్ 15వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై నెలకొన్న అంచనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా కేటగిరీలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంచనాలు స్కేని టచ్ చేస్తున్నాయి. దీంతో బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇంకా టైటిల్ కూడా ఖరారు కాకముందే కార్పోరేట్ కంపెనీలు తెలుగు రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. ఇప్పటికే హిందీ రైట్స్ ని జీ స్టూడియోస్ దక్కించుకుంది. హిందీ థియేట్రికల్ రైట్స్ సహా శాటిలైట్..డిజిటల్ హక్కుల్ని జీ స్టూడియోస్ చేజిక్కించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందుకోసం భారీ మొత్తం వెచ్చించినట్లు గతంలో స్థానిక మీడియా సంస్థల్లో వైరల్ గా మారింది. తాజాగా ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ఖరారు చేసింది. దాదాపు 350 కోట్లు వెచ్చించి హిందీకి సంబంధించి అన్ని రకాల హక్కుల్ని చేజిక్కించుకున్నట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెబ్ సైట్ ధృవీకరించింది.
ఇతర భాషల శాటిలైట్..డిజిటల్ ..థియేట్రికల్ రైట్స్ మాత్రం చిత్ర నిర్మాత దిల్ రాజ్ వద్దనే ఉన్నాయి. అయితే వీటి కోసం పలు కార్పోరేట్ కంపెనీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తొలి పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతోనే ఈ రేంజ్ లో పోటీ వాతావరణం ఉన్నట్లు కనిపిస్తోంది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న `ఆర్.ఆర్.ఆర్` విజయం సాధిస్తే చరణ్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో వెలిగిపోతుంది. అందుకే కార్పోరేట్ కంపెనీలు ఆర్.సీ 15 విషయంలో ముందుగానే కర్చీప్ వేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక భాషల్లో మాత్రం ఈ చిత్రాన్ని దిల్ రాజు తన భాగస్వాములతో కలిసి సొంతంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూర్తయింది. మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ టీమ్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రిలో రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. జూన్ నెలాఖరకు షూటింగ్ మొత్రం పూర్తవుతుందని సమాచారం.
ఆ తర్వాత ఆరు నెలలు పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయి. అన్ని పనులు పూర్తిచేసుకుని 2023 లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.