`భారతీయుడు 2` వివాదం నేపథ్యంలో RC15 ఉంటుందా ఉండదా? అంటూ సందిగ్ధత వ్యక్తమైంది. లైకా సంస్థతో శంకర్ వివాదం సమసిపోలేదు. కోర్టుల పరిధిలో ఉంది. అయితే కోర్టు శంకర్ తదుపరి చిత్రాలకు లైన్ క్లియర్ చేయడంతో ఆర్.సి 15 పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా పక్కాగా సెట్స్ కి వెళ్లబోతోంది. RC15 ఆగష్టు మధ్య వారం నుండి ప్రారంభమవుతుంది. వేసవి 2022 నాటికి చిత్రాన్ని పూర్తి చేస్తామని శంకర్ హామీ ఇచ్చారు. కథానాయికగా ఎవరు నటిస్తారు? అన్నది ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకూ ఆలియా.. కియరా.. పూజా హెగ్డే అంటూ చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ కియారా అద్వానీ లేదా ఆలియా ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే ఛాన్సుందని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
మరోవైపు రామ్ చరణ్ - శంకర్ మూవీలో ఓ సర్ ప్రైజింగ్ గెస్ట్ కనిపిస్తారని ఆ పాత్ర కొన్ని సన్నివేశాలకే పరిమితమైనా కానీ అదిరిపోతుందని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా సర్ ప్రైజింగ్ గెస్ట్ అంటే.. విశ్వనటుడు కమల్ హాసన్ ఇందులో అతిథిగా కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కమల్ తో శంకర్ సాన్నిహిత్యం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి కాంబినేషన్ భారతీయుడు లాంటి సంచలన చిత్రం వచ్చింది. ఇప్పుడు భారతీయుడు 2 సెట్స్ పై ఉంది. వివాదాల వల్ల ఆగినా ఇది మునుముందు పూర్తి చేయాల్సి ఉంటుంది.
చరణ్ కోసం కమల్ ని సంప్రదించగా అతడు ఓకే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఇకపోతే కమల్ హాసన్ పాత్ర ఏ తరహాలో ఉంటుంది? అన్నదానిపైనా ఇకపై అభిమానులు ఎవరి ఊహాగానాలు వారు సాగిస్తున్నారు. సోషల్ అండ్ పొలిటికల్ డ్రామా అవినీతి నేపథ్యంలో చరణ్ తో ఆర్.సి 15 తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ మూవీలో సడెన్ గా కత్తిపోట్లు పొడిచే సేనాపతి 2.0 రీక్రియేట్ అవుతారా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఇకపోతే కమల్ హాసన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు అని శంకర్ కానీ నిర్మాత దిల్ రాజు కానీ ప్రకటించే వరకూ దానిని అధికారికంగా కన్ఫామ్ చేయలేం.
ఒకవేళ కమల్ హాసన్ -రామ్ చరణ్ లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సాధ్యపడితే అంతకుమించిన ఆనందం చరణ్ అభిమానులకు వేరొకటి ఉండదు. కమల్ హాసన్ సినిమాలో ఉండటం చరణ్ కు పెద్ద ప్లస్ అవుతుంది. అతడు తన కోలీవుడ్ మార్కెట్ ను విస్తరించడానికి ఇది పెద్దగా కలిసొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదే మూవీలో కరుడుగట్టిన విలన్ పాత్ర కోసం శంకర్ ఒక క్రేజీ బాలీవుడ్ స్టార్ ని బరిలో దించే వీలుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసినదే. రామ్‌చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ టీమ్ తో కలిసి ఉక్రెయిన్ కు పాట చిత్రీకరణ కోసం వెళ్లారు. కొద్దిరోజుల్లో చిత్రీకరణ ముగించి తదుపరి చిత్రంపై దృష్టి సారిస్తారు.