నలుగురి క్వీన్లకూ ఆయనే దారి చూపిస్తాడు

Update: 2018-01-22 18:30 GMT
దారి చూపించేవాడ్ని దేవుడు అంటారా? ఫిలిం ఇండస్ర్టీలో అయితే దర్శకుడు అంటారు. ఈ మద్యన ఆ స్థానాన్ని చాలామంది తీసుకుంటున్నా కూడా.. నిజానికి దర్శకుడే దార్లన్నీ వేసేది నడిచేది చూపించేది. ఇప్పుడు మనం 'క్వీన్' సినిమా విషయానికి వచ్చేస్తే.. అసలు ఆ సినిమా రీమేక్ విషయంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ సరిగ్గా తెలియట్లేదు. నిజానికి కంగనా రనౌత్ హీరోయిన్ గా హిందీలో వచ్చిన క్వీన్ ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యిదంటే.. అది అంచనాలు లేకుండా సింపుల్ గా సినిమా వచ్చేయడం వలన. కాని సౌత్ లో మాత్రం ఈ సినిమాను అంచనాలతో చంపేస్తున్నారు.

ఈ సినిమాకు ఏకంగా ఒకేసారి నాలుగు రీమేక్ లను చేస్తూ.. తెలుగులో తమన్నా.. తమిళంలో కాజల్.. మలయాళంలో మంజిమా మోహన్.. కన్నడలో పారుల్ యాదవ్ లతో ఈ సినిమాను తీస్తున్నారు. ఇదే చాలా ఓవర్ అంటే.. ఇప్పుడు నాలుగు బాషలకు నలుగురు దర్శకులు అన్నట్లు మరో హడావుడి కూడా చేశారు. అక్కడ కట్ చేస్తే.. తెలుగు అండ్ మలయాళం వర్షన్ ను ప్రముఖ డైరక్టర్ నీలకంఠ చేతిలో పెట్టారు. అయితే ఆయనకూ తమన్నాకూ క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఆయన తప్పుకున్నాడు. ఈ విషయంలో తమన్నా తెలివిగా అంతా నిర్మాతే చేశాడు అని చెప్పినా కూడా.. ఇప్పుడు నీలకంఠ స్థానంలో యాక్టర్ రమేష్‌ అరవింద్ సదరు సినిమాను తీస్తున్నాడు.

విషయం ఏంటంటే.. నాలుగు బాషల్లోనూ క్వీన్ రీమేక్ ను ఈయనే తీస్తున్నాడు. అసలు ఆ సినిమా వచ్చి చాలా ఏళ్ళయిపోగా.. ఇప్పుడు ఇలా నాలుగు బాషల్లో నలుగురు అమ్మాయిలతో ఒకరే డైరక్టర్ మరియు ఒకరే ప్రొడ్యూస్ రీమేక్ చేయడం.. ఏంటో మరి. కానివ్వండి. కనీసం ఒక్క బాషలోనైనా ఈ సినిమా ఆడితే చాలు అన్నట్లుంది ట్రేడ్ వర్గాల అంచనా. అదీ చూద్దాం.
Tags:    

Similar News