ఫిజీ దీవుల్లో పర్యటించి ఆ దీవులకు భీభత్సమైన ప్రచారం చేసింది ఇలియానా. ఫిజీ ప్రభుత్వం ఏరికోరి మరీ సన్నజాజి సోయగం ఇలియానాని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుని ప్రచారం సాగించింది. ఇదివరకూ రిలీజైన ఫిజీ టూరిజం వీడియోల్లో ఇలియానా ఎంతగా వేడెక్కించిందో అంతకుమించి ఫిజీ ఎగ్జోటిక్ లొకేషన్లు హీటెక్కించాయి. బులుగు జిలుగు సముద్రపు కాంతి ఫిజీ ఐల్యాండ్ లోని పచ్చదనంపై పరుచుకుని రారమ్మని కోరింది.
అందుకేనేమో సీనియర్ నటి రమ్యకృష్ణ- నాజర్ బృందాన్ని - కొందరు యువనటీనటుల్ని కలుపుకుని దర్శకుడు వెంకట్ ప్రభు ఫిజీ ఐల్యాండ్ లో చాలానే సాహసాలు చేశాడు. అతడు చేసిన సాహసమెంతో తాజాగా తెలుగు మీడియాకు ప్రదర్శించిన వీడియోల్లో కనిపించింది. మత్తెక్కించే రేంజులో ఫిజీ అందాల నడుమ కలర్ ఫుల్ ఫ్రేములతో చింపి ఆరేశాడు. లేటు వయసులో ఘాటైన సినిమాలు తీసే ఈ డైరెక్టర్ గ్యాంబ్లర్ ని మించిన పాయింట్ తో పోస్ట్ డీమానిటైజేషన్ కాన్సెప్టుతో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తీశాడట. ట్రైలర్ - పాటల ఈవెంట్ లో మరో టాప్ సీక్రెట్ ని నాజర్ బయటపెట్టారు. ఇక దీనిని రెగ్యులర్ సినిమాగా చూడొద్దని సైతం అన్నారు.
ఇళయరాజా తమ్ముడి కొడుకు వెంకట్ ప్రభు... కెరీర్ 8వ సినిమా `పార్టీ`. ఆ టైటిల్ కి తగ్గట్టే 40రోజుల షెడ్యూల్ లో కైపెక్కించే ఫిజీ అందా నడుమ షూటింగుల్లో పాల్గొన్నాం... అసలు షూటింగ్ లా కాదు.. పార్టీలా ఎంజాయ్ చేశామని తెలిపారు. ఇదే వేదికపై రమ్యకృష్ణ ఆంటీ గారి అందం చూస్తుంటే.. ముగ్ధమనోహర రూపంతో కూతురిలా కనిపిస్తోందని సత్యరాజ్ జోక్ చేశారు. ఈ సినిమాలో సత్యరాజ్ మనవడిలా కనిపిస్తున్నారని సెటైర్లు వేయడం పకపకా నవ్వించింది. ఆసక్తికరంగా ఈ సీనియర్ల గుంపుతో నలుగురు హాట్ గాళ్స్ ఈ చిత్రంలో ఓ రేంజులో పార్టీ చేసుకున్నారని ఫిజీ ఎగ్జోటిక్ లొకేషన్లతో కూడుకున్న విజువల్స్ చెప్పాయి.
Full View