కొంతమంది హీరోయిన్లకు నిజంగా 50 వయస్సు రానప్పటికీ.. వారు అప్పుడే తల్లి క్యారెక్టర్లు చేసేస్తున్నారు. ఉదాహరణకు మన రమ్యకృష్ణను తీసుకోండి. అప్పట్లో తను సిద్దార్ద్ కు తల్లిగా చేసింది. ఆ తరువాత మొన్ననే బాహుబలిలో ప్రభాస్ అండ్ రానాకు తల్లిగా చేసింది. అయితే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఏకంగా కింగ్ నాగ్ కు తల్లిగా చేసేసింది. కాని ఆవిడ తల్లి వేషాల్లో ఒక మెలిక కూడా ఉందండోయ్.
సోగ్గాడే చిన్న నాయనా సినిమాలో ఆమె నాగార్జునను అమ్మా అని కాని మమ్మీ అని కాని పిలువనివ్వలేదు. చిన్నప్పటి నుండి కొడుకు (నాగ్) ఆమెను సత్య అని పిలుస్తాడు. నన్ను అమ్మ అని పిలవను అంటేనే సినిమా చేస్తాను అని చెప్పిందట రమ్య కృష్ణ. అయితే ఇప్పుడు ఆమె ''శభాష్ నాయుడు'' సినిమాలో కమల్ హాసన్ వైఫ్ గా చేస్తోంది. అంటే శృతి హాసన్ కు తల్లి క్యారెక్టర్ వేస్తోంది అనమాట. మరి ఇప్పుడు శృతి ఆమెను మమ్మీ అని పిలవొచ్చా? లేకపోతే ఈమెకు కూడా ఏదైనా లింకు పెడుతుందా? అసలే బయట శృతి ఈమెను అక్క అని పిలుస్తుందట.
వరుసపెట్టి సినిమాల్లో బిజీ అయిపోయిన రమ్యకృష్ణ.. ఇలా మమ్మీ అని పిలువకూడదు అని కండీషన్లె పెడితే ఎలాగండి? ఆ.. హౌ?