యూనివర్సిల్ హీరో కమల్ హాసన్ - సీనియర్ హీరోయిన్ గౌతమి దాదాపు 13 సంవత్సరాల పాటు సహజీవనం చేసి రీసెంట్ గా విడిపోవడం సౌత్ ఇండియా సినిమా వర్గాల్లో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గౌతమి కేన్సర్ భారీన పడినప్పుడు కూడా కమల్ ఆమె వెన్నంటే ఉండి ఆమె కోలుకునే వరకు ఆమెలో ఎంతో ఆత్మస్థైర్యం నింపారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు సడెన్గా ఎందుకు విడిపోయారు అనే అంశంపై రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి.
వీరి బ్రేకప్ వెనక ముందుగా కమల్ ముద్దుల కూతురు శృతీహాసన్ పేరు వినిపించింది. కమల్ - గౌతమి కలిసి ఉండేందుకు అస్సలు ఇష్టపడని శృతి ..గౌతమితో పలుసార్లు విబేధించేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా కమల్ - శృతి కలిసి నటిస్తోన్న ‘శభాష్ నాయుడు’ సినిమా కాస్ట్యూమ్స్ విషయంలో వీరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరడం..ఈ విషయంలో కమల్ శృతికి సపోర్ట్ చేయడంతో గౌతమి తీవ్రంగా హర్ట్ అయ్యిందని కూడా ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ బ్రేకప్ విషయంలో ఇప్పుడు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో కమల్ సరసన నటిస్తోన్న రమ్యకృష్ణకు గౌతమికి కూడా గొడవ జరిగిందట. గౌతమి డిజైన్ చేసిన ఓ కాస్ట్యూమ్ ను వేసుకోవడానికి రమ్య ఒప్పుకోలేదట. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో కమల్..గౌతమిని కాకుండా రమ్యకే సపోర్ట్ చేశాడట.
అటు శృతి వివాదంతో పాటు ఇటు రమ్య వివాదంలో కూడా కమల్ తన అభిప్రాయాన్ని పక్కన పెట్టడం గౌతమిని ఎంతో కుంగదీసిందట. వారంతా తన పనితనాన్ని శంకించడాన్ని గౌతమి తట్టుకోలేకపోయిందట. ఈ చిన్న చిన్న గొడవలే పెద్దవిగా మారి చివరకు కమల్ - గౌతమి విడిపోయేందుకు దారి తీశాయని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/