వీడియో: అగ్గి పెట్టెలో ప‌ట్టే చీర‌లో ర‌మ్య‌కృష్ణ‌

Update: 2022-08-09 13:36 GMT
మ‌న‌సుండాలే కానీ వ‌య‌సుతో ప‌నేం ఉంది? 60 ప్ల‌స్ ఏజ్ లో కూడా ఏజ్ లెస్ బ్యూటీస్ గా పాపుల‌ర‌వుతున్న వెట‌ర‌న్ నాయిక‌లు మ‌న‌కు ఉన్నారు. అస‌లు వ‌య‌సును క‌నిపించ‌కుండా దాచేయ‌డం ఎలానో వీళ్ల‌ను చూసి నేటిత‌రం స్ఫూర్తి పొందుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. రేఖ‌- హేమ మాలిని- శ్రీ‌దేవి- మాధురి ధీక్షిత్ అంత‌గా మెయింటెయిన్ చేశారు.

సీనియ‌ర్ న‌టీమ‌ణి ర‌మ్య‌కృష్ణ కూడా ఇదే కోవ‌లో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఏజ్ హాఫ్ సెంచ‌రీ దాటినా ఇప్ప‌టికీ త‌న‌లోని రూప‌లావ‌ణ్యం ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ అదే స్పీడ్ అదే జోష్.

ఇటీవల లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌ద‌ర్ పాత్ర‌లో న‌టించారు. ట్రైల‌ర్ లో ఎంతో జోరుగా క‌నిపించారు ర‌మ్య‌. బాహుబ‌లి శివ‌గామిగా ఎంతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ర‌మ్య‌కృష్ణ‌కు పూరి మ‌రో అద్భుత అవ‌కాశాన్ని ఇచ్చార‌ని అర్థ‌మ‌వుతోంది. వెట‌ర‌న్ న‌టి ఎమోష‌నల్ పెర్ఫామెన్స్ తో ర‌క్తి క‌ట్టించ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు.

ఇక‌పోతే ముంబైలో లైగ‌ర్ కి ఎక్కువ‌గా ప్రమోష‌న్స్ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ర‌మ్య‌కృష్ణ హిందీ మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యారు. ఆ స‌మ‌యంలో శారీలో హొయ‌లు పోతూ ఫోటోషూట్ కి ఫోజులిచ్చారు. అగ్గి పెట్టెలో ప‌ట్టేంత‌టి లైట్ వెయిట్ జ‌రీ చీర అలా గాలికి ఎగిరిపోతుంటే అక్క‌డ ర‌మ్య‌కృష్ణ ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు ఆక‌ట్టుకుంది.

ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే ఇలా ప‌లుచ‌ని చీర‌లో ఎంతో ప్ర‌త్యేకంగా ర‌మ్య‌కృష్ణ త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్న తీరుకు సాహో అని అభిమానులు పొగిడేస్తున్నారు. అపుడెపుడో అగ్గిపెట్టేలో ప‌ట్టేంత చీర‌ను నేసి ఇందిర‌మ్మ‌కు కానుకిచ్చారు. ఇప్పుడు శివ‌గామి అలాంటి అరుదైన చీర‌లో హొయ‌లు పోతోంది! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోషూట్ ఆద్యంతం ర‌మ్య క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ అంతే ఆక‌ట్టుకున్నాయి.

ఒక వెట‌ర‌న్ తెలుగు న‌టీమ‌ణిగా రమ్య‌కృష్ణ కు హిందీ చిత్ర‌సీమ‌లోనూ గొప్ప గుర్తింపు ఉంది. సీనియ‌ర్ న‌టీమ‌ణి ప‌లు హిందీ చిత్రాల్లోనూ న‌టించారు. ఇప్పుడు లైగ‌ర్ తో మ‌రోసారి అక్క‌డి ప్ర‌జ‌ల్ని ప‌ల‌క‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ శారీ లుక్ ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. లైగర్ ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. అలాగే ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న `రంగ‌మార్తండ` విడుద‌ల కావాల్సి ఉంది. తెలుగు -త‌మిళంలో ర‌మ్య‌కృష్ణ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగుతున్నారు.

Tags:    

Similar News