మొదటి నుంచి కూడా సూర్య తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఈటి' ఈ నెల 10వ థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన రానా మాట్లాడుతూ .. "ముందుగా 'ఈటి' టీమ్ కి వెల్ కమ్ చెబుతున్నాను. 'పితామగన్' అనే సినిమాను సూర్యగారు చేసినప్పుడు ఆయన పేరు కూడా నాకు తెలియదు. కానీ అప్పటి నుంచే ఆయన ఫ్యాన్ అయిపోయాను.
ఆ తరువాత కాలంలో నేను ఆయనను కలవడం .. పరిచయం కావడం జరిగింది. ఆ తరువాత ఇద్దరం కూడా చాలా క్లోజ్ అయ్యాము. ఒక పదేళ్ల క్రితం అనుకుంటాను. నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్ లో చూసి, నన్ను తన కారులో ఓ నాలుగు గంటలపాటు హైదరాబాద్ మొత్తం తిప్పారు. 'ఒరేయ్ నువ్వు చేసేది యాక్టింగ్ కాదురా' అంటూ క్లాస్ పీకారు. రానా ఆ మాట అనగానే ఆయన చేతిలోని మైకును సూర్య లాక్కోబోయారు.
దాంతో రానా ఆయనకి దొరక్కుండా తప్పించుకున్నారు. ఆ తరువాత సూర్య ఆయనను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. రానా కంటిన్యూ చేస్తూ .. "ఆ సమయంలో సూర్యగారు పీకిన క్లాస్ నన్ను భళ్లాలదేవను చేసింది .. డానియల్ శేఖర్ ను చేసింది అనగానే, సూర్య మైక్ అందుకుని తనకి చాలా సంతోషంగా .. గర్వంగా ఉందని చెప్పారు. రానా తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ .. " సూర్యగారి గురించి నేను పెద్దగా చెప్పవలసిన పనేలేదు. ఆయన గురించి ఇక్కడున్న ఆయన అభిమానులందరికీ తెలుసు.
ఇక సూర్య గారి తరువాత నేను చెప్పవలసిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు .. ఆయనే కట్టప్ప. ఐదేళ్ల పాటు మేము కలిసి పనిచేశాము. ఒకరి ముఖాలు ఒకరం చూసుకుని చిరాకు వచ్చేసింది .. ఆ తరువాత లవ్ వచ్చేసింది. చాలా రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు ఎప్పటికీ సంతోషాన్ని కలిగించే విషయం. సూర్యగారు మాత్రమే కాదు .. పాండిరాజ్ గారు కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.