బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒకేసారి తెలుగు.. తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో ఈ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. అన్ని భాషల్లోనూ అద్భుతమైన రియాక్షన్ తో బాహుబలి2 ట్రైలర్ దూసుకుపోతోంది.
ట్రైలర్ లాంఛ్ సందర్భంగా ప్రభాస్.. రానా.. రాజమౌళితోపాటు పలువురు బాహుబలి సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక్కడ రానాకు ఓ టిపికల్ క్వశ్చన్ ఎదురైంది. బాహుబలి మూవీలో రానా డ్యాన్సులు చూసే అవకాశం ఫ్యాన్స్ మిస్ అయ్యారని.. ఈ సారైనా అలాంటి అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు రానా ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. పోస్టర్ లో భల్లాలదేవుడి వైపూ చూపిస్తూ.. 'ఒకసారి ఆ పోస్టర్ వైపు క్లియర్ గా చూడండి. అది చూస్తే సాంగ్స్ చేసేవాడిలా.. డ్యాన్సులు వేసే వాడిలా కనిపిస్తున్నాడా మీకు' అంటూ ఎదురు ప్రశ్న వేశాడు రానా.
అదే టాపిక్ ఇంకా కంటిన్యూ అవడంతో.. 'లేదండీ.. అమ్మాయిలతో డ్యాన్సులు అవీ ప్రభాస్ చేసుకుంటాడు. నేను పని చేసుకుంటూ ఉంటానంతే. నేను చాలా సిన్సియర్ మనిషిని' అని రానా అనడంతో.. అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశారు. రానా సెన్సాఫ్ హ్యూమర్ కి ఎన్ని మార్కులు వేసినా తక్కువే కదూ!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/