భల్లాలదేవా.. వాట్ ఎ పోస్టర్

Update: 2017-04-02 10:19 GMT
‘బాహుబలి: ది బిగినింగ్’కు సంబంధించి విడుదలకు ముందు అప్పట్లో రిలీజ్ చేసిన ఒక్కో పోస్టర్ ఎంత చర్చనీయాంశమయ్యాయో గుర్తుండే ఉంటుంది. వాటిలో శివుడి లుక్ తర్వాత అత్యంత ఆకట్టుకున్నది భల్లాలదేవుడి పోస్టరే. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన భల్లాలదేవుడి లుక్ విషయంలో మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కార్టూన్ బొమ్మను తలపించేలా ఉన్న డ్రెస్సింగ్ పై విమర్శలు వచ్చాయి.

ఐతే తాజాగా రిలీజైన రానా పోస్టర్ మాత్రం వావ్ అనిపించక మానదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజ్ నెలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో నిన్న రాత్రి బాహుబలి అఫీషియల్ ట్విట్టర్ పేజీలో రానా లుక్ ఒకటి షేర్ చేస్తూ.. ‘వెల్కం టు బాహుబలి మంత్’ అంటూ ట్వీట్ చేశారు. కండలు తిరిగిన శరీరంతో కదనరంగంలోకి దూకినట్లు భీకరంగా కనిపిస్తున్న భల్లాల దేవుడు ఔరా అనిపించేశాడంతే. బ్యాగ్రౌండ్లో సింహాల బొమ్మలు కూడా ఈ పోస్టర్ని మరింత ఎలివేట్ చేశాయి.

కొన్ని కొన్ని రోజుల విరామంతో ఇలాగే ఇకపై రిలీజ్ ముందు వరకు సినిమాలోని ముఖ్య పాత్రధారుల లుక్స్ ఒక్కోటి రిలీజ్ చేస్తారట. ‘ది బిగినింగ్’ విడుదలకు ముందు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అది మంచి ఫలితమే ఇచ్చింది. ‘ది కంక్లూజన్’ మీద ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ఇప్పుడు ఈ పోస్టర్ల తాకిడితో ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News