తెలుగులో సంచలనం సృష్టించిన `అర్జున్ రెడ్డి` బాలీవుడ్ లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ దేవరకొండ నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన `అర్జున్ రెడ్డి` తెలుగు చలన చిత్ర గమనాన్ని మార్చి ఓ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. కొత్త తరహా సినిమాలకు ధైర్యాన్నిచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో `కబీర్ సింగ్` పేరుతో బాలీవుడ్ లో సందీప్ వంగ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. షాహీద్ కపూర్ - కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మించింది. ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సీఫీస్ వద్ద 200 కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో కాంట్రవర్సీలతో ఉత్తర - దక్షిణా భారత చలన చిత్ర పరిశ్రమల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రేమికులు ఒకరిని ఒకరు కొట్టుకోకపోతే వారిలో ప్రేమ అన్నది లేనట్టేనని ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సందీప్ వంగ ఇచ్చిన స్టేట్ మెంట్ పై సమంత - గాయని చిన్మయి కౌంటర్ ఇచ్చారు. కొట్టుకుంటేనే ప్రేమ ఉన్నట్టని చెప్పడం నచ్చలేదని ఇద్దరూ కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియా ఈ ఇద్దరిని ఓ రేంజ్ లో ఆడేసుకుంది. దీనిపై చిన్మయి క్లారిటీ ఇస్తూ ఎవరు ఎంత తిట్టుకున్నా నా అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతానని నెటిజన్ లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినంతపని చేసింది. ఇదిలా వుంటే `కబీర్ సింగ్` సినిమాపై భల్లాలదేవ రానా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
సౌంత్ ఇండియన్ రీమేక్ సినిమాల విషయంలో గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం చాలా బాగుంది. `కబీర్ సింగ్` రిలీజ్ కి ముందు రోజు రాత్రి ఏం జరిగిందో నా మిత్రుడు ఒకరు ఆసక్తికరమైన సమాచారాన్ని నాకు అందించాడు. సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రి హైదరాబాద్ లో `కబీర్ సింగ్` ప్రీమియర్ షోస్ వేశారు. అత్యధిక స్థాయిలో ప్రీమియర్ టికెట్స్ అమ్ముడు పోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ రీమేక్ చిత్రానికి ఇలా జరగడం చాలా అరుదు. ఈ చిత్ర హిందీ రీమేక్ ని చూడాలని చాలా మంది ఆసక్తిని చూపించారు. ఇది చాలా ఆసక్తిని రేకెత్తించే అంశం. జంగిల్ బుక్ - ది లయన్ కింగ్ చిత్రాల స్థాయిలో ఈ చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులు పోటీపడుతున్నారు. `కబీర్ సింగ్` 300 కోట్లు దాటబోతోంది. మితిమీరిన శృంగార సన్నివేశాల కారణంగా క్రిటిక్స్ నుంచి విమర్శల్ని కూడా అదే స్థాయిలో ఎదుర్కొంటోంది` అని రానా చెప్పడం ఆసక్తికరంగా మారింది.