రానాని మాయ చేసిన అమ్మాయి వివరాలు ఇవే...!

Update: 2020-05-12 12:31 GMT
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకరు రానా దగ్గుబాటి. తన ఏజ్ ఉన్న తోటి హీరోలు.. తనతో కలిసి చదువుకున్న హీరోలు.. తన కంటే చిన్నవారైన హీరోలు అందరికి పెళ్లిళ్లు అవుతున్నా మన భల్లాల దేవుడు మాత్రం సైలెంటుగా ఉన్నాడు. తన స్నేహితులు రామ్ చరణ్ అల్లు అర్జున్ వివాహాలు కూడా జరిగిపోవడంతో అందరూ రానా పెళ్ళై ఎప్పుడంటూ ప్రశ్నించడం స్టార్ట్ చేసారు. అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబెర్ తన కంటే చిన్నవాడైన అక్కినేని నాగ చైతన్య పెళ్లి కూడా జరిగిపోవడంతో రానా మీద పెళ్లి ప్రెజర్ ఎక్కువ అయింది. తన తండ్రి దగ్గుబాటి సురేష్ కూడా ఎక్కడికి వెళ్లినా ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా రానా పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురవుతోంది అంటూ ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆరు అడుగుల భల్లాలదేవుడు ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా రానా తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. తన ప్రేయసితో కలిసి ఉన్న ఫోటోను జత చేసి 'ఆమె యస్ చెప్పింది' అని పోస్ట్ పెట్టాడు.

ఇప్పుడు మన భల్లాల దేవుడిని ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి ఎవరూ అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు మిహికా బజాజ్. ముంబై కు చెందిన మిహికా బజాజ్ డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియోను నడుపుతున్నది. లండన్ యూనివర్సిటీలో ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ మీద మాస్టర్స్ కంప్లీట్ చేసిన మిహికా బజాజ్ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒక ఆన్లైన్ ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్ట్ మ్యాగజైన్ కి రైటర్ గా కూడా వర్క్ చేసింది. ప్రస్తుతం డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో ఏర్పాటు చేసి ఈవెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చేస్తున్నదని తెలుస్తోంది. రానా ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూస్తే మన హీరోనే ఆమె వెంటపడ్డాడనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మరి ఈ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ విమెన్ టాలీవుడ్ హీరో రానాకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది.. ఎప్పటి నుండి ప్రేమాయణం సాగిస్తున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు రానా కి కంగ్రాట్స్ చెప్తున్నారు. సమంత అక్కినేని శ్రుతి హాసన్ హన్సిక ఆదా శర్మ మొదలైన వారు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు.

Tags:    

Similar News