మెగాస్టార్ తో పాటే నాకు కూడా

Update: 2016-03-29 07:57 GMT
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. పీకు చిత్రంలో నటనకు గాను అమితాబ్ ఈ పురస్కరాన్ని అందుకున్నారు. దీంతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే.. మన దగ్గుబాటి రానా మాత్రం విభిన్నంగా స్పందించాడు. ఒకవైపు బిగ్ బీని ఆకాశానికి ఎత్తేస్తూనే.. మెగాస్టార్ తో పాటే నాకు కూడా అంటున్నాడు రానా.

అమితాబ్ ఇలా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోవడం ఇది మూడో సారి. మొదటి సారి బ్లాక్ చిత్రానికి బిగ్ బీ ఈ పురస్కారం గెలుచుకున్నారు. అపుడు రానా నిర్మించిన 'బొమ్మలాట'కు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. ఆ తర్వాత 'పా' చిత్రంలో నటనకు గాను అమితాబ్ బచ్చన్ మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఆ సమయంలో కూడా దగ్గుబాటి రానా ఆ వేదికను పంచుకున్నాడు. రానా తాత రామానాయుడుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆ వేదికపైనే అందించారు. ఇప్పుడు బిగ్ బీ 'పీకు' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ ఏడాది రానా నటించిన బాహుబలి ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది.

ఇలా బిగ్ బీకి అవార్డ్ దక్కిన ప్రతీసారి తాను కూడా నిలబడగలగడం తన అదృష్టం అంటున్నాడు రానా. 'అమితాబ్ బచ్చన్ కాలంలో నటించే మహా అదృష్టం దక్కించుకున్న ఓ చిన్న భారతీయ నటుడిని నేను' అంటూ బిగ్ బీపై తన గౌరవం చాటుకున్నాడు రానా.
Tags:    

Similar News