రానా మీద 80 కోట్లు పోస్తున్నారా?

Update: 2016-01-19 15:30 GMT
రెండేళ్లు వెనక్కి వెళ్తే రానా దగ్గుబాటి భవిష్యతేంటో అర్థం కానట్లుండేది పరిస్థితి. హీరోగా చేసిన నేను నా రాక్షసి, నా ఇష్టం లాంటి సినిమాలు దారుణమైన ఫలితాల్నిస్తే.. బాలీవుడ్ లో కీ రోల్స్ చేసిన సినిమాలు కూడా అతణ్ని పెద్ద దెబ్బే కొట్టాయి. తమిళంలో కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. కానీ ఇప్పుడు చూడండి. సౌత్ ఇండియాలో రానాను కొట్టే ఆర్టిస్టే లేడన్నట్లుంది పరిస్థితి. టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్.. ఇలా మూడు ఇండస్ట్రీల్లోనూ క్రేజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు రానా. అతడితో మల్టీ లాంగ్వేజ్ మూవీస్ చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. రానాకు మూడు భాషల్లో మార్కెట్ - డిమాండ్ ఉండటం ఏ సినిమాకైనా కలిసొచ్చే అంశమే.

ఓ వైపు బాహుబలి-2 కోసం రెడీ అవుతూనే.. మరోవైపు బాలీవుడ్ మూవీ ‘ఘాజి’లో నటిస్తున్నాడు రానా. ఈ సినిమా మీద రూ.80 కోట్ల బడ్జెట్ పెడుతుండటం విశేషం. ఇండియాలో సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ సినమాను ఏమాత్రం రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకునే అవకాశముండటంతో ఖర్చుకు వెనకాడట్లేదట. సంకల్ప్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తాప్సి కథానాయిక. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News