మెగాస్టార్ చిరంజీవి తన కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో ఎన్నెన్నో సెన్సేషన్స్ సృష్టించేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఓ ఫంక్షన్ లో 'తెలుగు సినిమా పరిశ్రమను రెండున్నర దశాబ్దాల పాటు ఏలిన చక్రవర్తి' అంటూ మెగాస్టార్ ను మనసారా ప్రశంసించాడు దగ్గుబాటి రానా. ఇప్పుడు రానా నటించిన లేటెస్ట్ మూవీకి చిరంజీవి తన వాయిస్ అరువిచ్చి.. తన వంతుగా ఘాజీకి అదనపు విలువ చేకూర్చడమే కాదు.. ప్రమోషన్ కి హెల్ప్ అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో.. ఘాజీ లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. ' ఇప్పటివరకూ ఇండియా పాకిస్థాన్ ల మధ్య నాలుగు సార్లు యుద్ధాల్లో తలపడ్డాయ్. కానీ.. అందరికీ తెలియని మరో పోరాటం విశాఖపట్నం తీర సమీపంలో జరిగింది.. సముద్ర గర్భంలో..' అంటూ చిరు గంభీరంగా చెప్పిన వాయిస్ అదిరిపోయింది. ఆ తర్వాత చూపించిన ట్రైలర్ అయితే.. గతంలో చూపించినదే. కానీ చిరు వాయిస్ ఓవర్.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండడమే కాదు.. మెగా ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ అందేందుకు ఉపయోగపడనుంది.
ఈ నెల 17న విడుదల కానున్న ఘాజీపై చాలానే అంచనాలు ఉన్నాయి. తెలుగు.. తమిళ్.. హిందీల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది ఘాజీ. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఘాజీకి.. తెలుగులో చిరంజీవి వాయిస్ చెప్పగా.. హిందీలో అమితాబ్ బచ్చన్.. తమిళ్ వెర్షన్ కోసం సూర్య వాయిస్ ఇవ్వడం విశేషం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/