`బ్రోడాడి`తో డేనియ‌ల్ శేఖ‌ర్ కి ప‌నేంటో?

Update: 2021-12-06 16:30 GMT
మాల‌యాళం బ్లాక్ బస్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్` తెలుగులో `భీమ్లా నాయ‌క్` టైటిల్ తో  రీమేక్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో  బిజుమీన‌న్ పోషించిన  పాత్ర‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్...పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన రోల్ ని రానా పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్ప‌టికే రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన ప‌వ‌ర్ ఫుల్ లుక్ ని సైతం రివీల్ చేసారు. తాజాగా ఆన్  సెట్స్ లో పృథ్వీరాజ‌న్-రానా క‌లిసి దిగిన ఓ ఫోటోని పృధ్వీరాజ్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసారు. పృథ్వారాజ్ మోనిట‌ర్ లో స‌న్నివేశాన్ని చెక్ చేసుకుంటున్న స‌మ‌యంలో...వెనుక రానా కూర్చొని ఉన్నారు.

మ‌రి ఈ క‌ల‌యిక ఎప్పుడు జ‌రిగిందంటే?  చాలా రోజుల క్రిత‌మే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  పృథ్వీరాజ్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `బ్రో డాడి` చిత్రం  తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది భాగం షూటింగ్ హైద‌రాబాద్ లో కూడా జ‌రిగింది. ఈ స‌మ‌యంలో రానా `బ్రోడాడి` సెట్స్ కి వెళ్లి సుకుమార‌న్ తో మాట మంతి జ‌రిపిన స‌మ‌యంలో తీసిన ఫోటో ఇది. రానాకి ద‌క్షిణాది భాష‌ల న‌టులంద‌రితో మంచి స్నేహం ఉంది. న‌టుడిగాను సౌత్ లో ఫేమ‌స్. ఆ ర‌కంగా ఈ మూవ్ మెంట్ చోటు చేసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఇక రానా `భీమ్లా నాయ‌క్` లో డేనియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే  ఆ పాత్ర‌కు సంబంధించి గ్లింప్స్ సైతం రిలీజ్ అయింది. పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా మాతృక‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇందులో ఆయ‌న‌కు జోడీగా సంయుక్తం మీన‌న్ న‌టిస్తోంది. ప‌వ‌న్ కి జంట‌గా నిత్యామీన‌న్ న‌టిస్తుంది. ఈ చిత్రానికి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.  వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న చిత్రం రిలీజ్ కానుంది.
Tags:    

Similar News