హీరోలు అన్నాక లుక్కులు మారుస్తూనే ఉండాలి. మన దగ్గర మాత్రం జస్ట్ విగ్ మారిస్తే చాలు.. హీరో లుక్ మారిపోయినట్లే అనుకునే పరిస్థితి ఉండేది. కాని బాహుబలి సినిమాతో ఈ రూల్ మార్చేశారు ప్రభాస్ అండ్ రానా. సినిమా కోసం ఇష్టమొచ్చినట్లు ఫిజిక్ మార్చుకుని.. వారు యంగ్ హీరోలకు కొత్త దారి చూపించారు. అయినాసరే కొందరు హీరోలు మాత్రం ఇంకా లుక్ మార్చడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. క్యారక్టర్ ఏదైనా వారి లుక్ అదే.
అయితే అలాంటి హీరోలకు మరోసారి ప్రేరణ కలిగించడానికి ఇప్పుడు మళ్ళీ రానా దగ్గుబాటే నాంది పలికాడు. మొన్నటివరకు గెడ్డం పెంచుకుని ఇంకా భళ్ళాలదేవ గెటప్ లోనే కనిపించాడు రానా. అయితే ఇప్పుడు మాత్రం.. త్వరలో మొదలవ్వనున్న తన కొత్త సినిమా '1945' కోసం రెడీ అయిపోతున్నాడు. ఆల్రెడీ బాగా బరువు తగ్గిపోయిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు మీసాలు మాత్రం ఉంచుకుని.. క్లీన్ షేవ్ చేసేసి.. ఆ కాలం నాటి యువకుడిగా మారిపోయాడు. తను ఆ కాలం కోసమే అలా మారినా కూడా.. రానా అవతారం ఈ కాలానికి కూడా చాలా బాగుంది చంపేశాడు అంటున్నారు చూపరులు.
ప్రస్తుతం రానా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఇచ్చిన నూతనోత్సాహంలో తన కొత్త సినిమాలను మొదలెట్టేస్తున్నాడట. ఇక నుండి వెరైటీ సినిమాలను విత్ కమర్షియల్ ఎలిమెంట్లతో కలుపుకుని.. వరుసగా విక్టరీలు కొట్టేయాలని చూస్తున్నాడు. అది సంగతి.