యదార్ధ గాధలకు స్టోరీ - స్క్రీన్ ప్లే దట్టించి పర్ఫెక్ట్ విజువలైజ్ చేయడంలో హాలీవుడ్ మేకర్స్ చాలా అడ్వాన్స్ గా ఉంటారు. మన దగ్గర బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఈ కల్చర్ మొదలైంది. ఇంతకాలం రియల్ స్టోరీలతో సరైన సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటో రాణా చెబుతున్నాడు.
ప్రస్తుతం రాణా ఓ రియల్ స్టోరీ అయిన ఘాజీని చేస్తున్నాడు. 1971 ఇండియా-పాక్ వార్ సందర్భంగా వైజాగ్ సమీపంలో మునిగిపోయిన ఓ సబ్ మెరైన్ కి సంబంధించిన ఎపిసోడ్ పై నడిచే స్టోరీ ఇది. 'దీని గురించి తెలిసిన తర్వాత నేను దర్శకుడు సంకల్ప్ ను పిలిచాను. దీని గురించి మాట్లాడుకుని, తర్వాత చాలా రీసెర్చ్ చేశాం, ఆ తర్వాత భారీ మూవీగా తెరకెక్కించేదుకు డిసైడ్ అయ్యాం' అని చెప్పాడు రాణా. అయితే.. ఇలాంటి సంఘటనలు మిగిలిన ప్రాంతాల్లో అందరికీ తెలుస్తాయి. కానీ మన దగ్గర మాత్రం ఇవి ఎవరికీ తెలియవు, రియల్ స్టోరీలను, హీరోలను పట్టించుకునే కల్చర్ మన దగ్గర లేదంటున్నాడు రాణా.
వైజాగ్ సమీపంలో జరిగినా.. ఇప్పుడక్కడ ఎవరికీ దీని గురించి తెలియకపోవడంతో ఆశ్చర్యపోయానంటున్నాడు రాణా. ఈ పాత్రను పోషించేందుకు నేవీ ఆఫీసర్స్ ని కలిశానని చెప్పాడు. హైద్రాబాద్ ట్యాంక్ బండ్ లో నిర్మించిన పెద్ద స్విమ్మింగ్ పూల్ లో సబ్ మెరైన్ సెట్ వేసి, ఘాజీని నిర్మిస్తున్నారు. సినిమాలో 70శాతం ఈ సబ్ మెరైన్ లోనే నడుస్తుంది.