దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం విరాఠపర్వం. సాయి పల్లవి కథానాయిక. వేణు ఉడుగుల దర్వకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ -SLV సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమాలో నక్సలిజం కాన్సెప్ట్.. 90ల నాటి బ్యాక్ డ్రాప్ ఆద్యంతం ఉత్కంఠ పెంచనున్నాయని సమాచారం. 14 డిసెంబర్ రానా బర్త్ డే సందర్భంగా 9.09 ఏఎం ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయనున్నారు. 11.07 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఒక రోజు ముందు వెంకీ బర్త్ డే(13 డిసెంబర్) సందర్భంగా `నారప్ప` ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ వెంటనే రానా బర్త్ డే సందర్భంగా 14 డిసెంబర్ రోజున `విరాఠపర్వం` ఫస్ట్ గ్లింప్స్ తో హీట్ పెంచబోతోంది. ఎలానూ మహమ్మారీ క్రైసిస్ నుంచి బయటపడుతున్నాం గనుక వరుసగా నారప్ప.. విరాఠపర్వం సినిమాల్ని రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు పక్కా ప్రణాళికతో మూవ్ అవుతున్నారనే అర్థమవుతోంది. ఇప్పటికే మల్టీప్లెక్సుల్లో సినిమాలకు జనాల నుంచి స్పందన బావుంది. చిన్న పట్టణాల్లోనూ అన్నిచోట్లా పరిస్థితి సర్ధుకుంటే పెండింగ్ లేకుండా సినిమాల్ని రిలీజ్ చేయాలన్న ప్రణాళిక కనిపిస్తోంది.