సినీ పరిశ్రమలో అందరూ తప్పులు చేస్తుంటారు. కానీ ఆ తప్పుల్ని ఒప్పుకునే వాళ్లు కొద్దిమందే. రానా దగ్గుబాటి ఇలాగే నిజాయితీగా తాను చేసిన ఓ తప్పును ఒప్పుకున్నాడు. తాను హీరోగా నటించిన ‘నా ఇష్టం’ సినిమా విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు రానా. కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమా చేయాల్సింది కాదు అని అనిపించేది ‘నా ఇష్టం’ మాత్రమే అని చెప్పాడు రానా. తనకు ఆ తరహా పాత్రలు సూటవ్వవని.. పైగా అందులో తాను డ్యాన్సులు చేయడం పెద్ద తప్పని అన్నాడు రానా. ఇండస్ట్రీలో డ్యాన్సులు చేయడానికి చాలామంది ఉన్నారని.. అలాంటపుడు మళ్లీ తాను కూడా డ్యాన్సులు చేయడం కరెక్ట్ కాదని.. తన బాడీ లాంగ్వేజ్ కు డ్యాన్సులు సూటవ్వవని రానా చెప్పాడు.
ఇక ప్రేమ.. పెళ్లి వ్యవహారాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ‘సింగిల్’ స్టేటస్ ను ఆస్వాదిస్తున్నానని.. పెళ్లి గురించి ఇప్పుడేమీ ఆలోచించట్లేదని చెప్పాడు రానా. బాహుబలి లాంటి, రుద్రమదేవి లాంటి సినిమాలతో ఈ ఏడాది అద్భుతంగా సాగిందని.. ‘బెంగళూరు డేస్’ రీమేక్ లో నటించడం కూడా గొప్ప అనుభూతని రానా చెప్పాడు. సినిమాల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని మార్చుకోవచ్చని.. తాను ఇటీవల నటించిన కొన్ని సినిమాల ద్వారా తెలిసిందని రానా చెప్పాడు. విలన్ పాత్రలు చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని.. ‘బాహుబలి’ తర్వాత ఆ విషయంలో తన కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని అన్నాడు.