ప్రేక్షకులు ఓమాదిరిగా అంచనాలు పెట్టుకున్నా వాటిని అందుకోవడం దర్శకుడికి సవాలుగా నిలుస్తుంది. ఐతే రాజమౌళి మాత్రం ఈ అంచనాల ఒత్తిడిని తట్టుకోవడంలో ఆరితేరిపోయాడు. అతడి ప్రతి సినిమాకూ అంచనాలు భారీగానే ఉంటాయి. జక్కన్న తాజా సినిమా 'బాహుబలి-2' మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో కొంతమందిని రాజమౌళి నిరాశ పరిచినా.. మెజారిటీ ఆడియన్స్‌ను మెప్పించాడు. బాహుబలికి దేశవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బహుశా రాజమౌళికి కూడా ఆశ్చర్యం కలుగుతుండొచ్చు. సినిమా చూసిన వాళ్లంతా బాహుబలి-2 ఎప్పుడు జక్కన్నా అని అడుగుతున్నారు.
ఇప్పటికే బాహుబలి-2 మీద భారీ అంచనాలు మొదలైపోయాయి. ఇంతలోనే ఆ అంచనాల్ని మరింత పెంచేసేలా మాట్లాడాడు దగ్గుబాటి రానా. ''బాహుబలి ది కన్‌క్లూజన్ వచ్చాక.. బాహుబలి ది బిగినింగ్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, సెట్లు, భారీతనం.. అన్నీ కూడా ఫస్ట్ పార్ట్ కంటే గొప్పగా ఉంటాయి'' అని చెప్పాడు రానా. సినిమాలో తన పాత్రకు ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ తాలూకు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందన్న రానా.. షూటింగ్‌లో పడ్డ కష్టం అంతా సినిమా సాధించిన విజయం చూశాక దూదిపింజలా ఎగిరిపోయిందని అన్నాడు.