సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలలో దగ్గుబాటి రానా ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హ్యాండ్సమ్ హంక్.. 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రానా కు ట్విట్టర్ లో 6.5 మిలియన్లకు ఫాలోవర్స్ ఉండగా.. ఇన్స్టాగ్రామ్ లో 4.7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఇన్స్టాలో అతని పోస్టులు కనిపించకుండా పోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
రానా దగ్గుబాటి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ప్రస్తుతం జీరో పోస్టులు కనిపిస్తున్నాయి. టాలెంటెడ్ హీరో అన్ని పోస్ట్ లను డిలీట్ చేసినట్లు అర్థం అవుతోంది. ట్వీట్స్ అలానే ఉంచి.. ఇన్స్టా పోస్ట్లను రానా ఎందుకు తొలగించాడో అని అందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో.. "పని జరుగుచున్నది. సోషల్ మీడియా విశ్రాంతి తీసుకుంటున్నారు. సినిమాల్లో కలుద్దాం. బిగ్గర్. బెటర్. స్ట్రాంగర్” అంటూ రానా ఇటీవల ట్విట్టర్ లో ఓ ప్రకటనను షేర్ చేశారు.
రానా దగ్గుబాటి సోషల్ మీడియా నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి అతని వ్యక్తిగత జీవితంపై రూమర్స్ మొదలయ్యాయి. రానా మరియు అతని భార్య మిహీకా బజాజ్ మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చయేమో అంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే దగ్గుబాటి దంపతులు ఈరోజు తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రానా కనీసం ఇన్స్టా స్టోరీ కూడా పెట్టలేదు.
అదే సమయంలో రానా సతీమణి మిహిక తన అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇద్దరూ కలిసి దిగిన కొన్ని బ్యూటీఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెంకటేష్ పెద్ద కుమార్తెతో పాటుగా పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వీటిని మిహిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది.
రానా భార్య పోస్టులతో భార్యాభర్తల మధ్య ఏం జరగలేదని స్పష్టం అవుతోంది. నెట్టింట వస్తున్న రూమర్స్ అన్నీ ఒట్టి గాలి వార్తలే అని అర్థమవుతోంది. అయితే రానా ఎందుకు ఇన్స్టాగ్రామ్ పోస్టులు తొలగించారనేది పక్కన పెడితే.. వర్క్ మీద ఫోకస్ పెట్టడానికి సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నారని అభిమానులు అంటున్నారు.
కాగా, దగ్గుబాటి రానా కరోనా పాండమిక్ టైంలో ఇంటివాడయ్యాడు. 2020 ఆగష్టు 8న తన ప్రేయసి మిహికా బజాజ్ తో ఏడడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు మరియు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది. తెలుగు మరియు మరాఠీ సంప్రదాయ పద్ధతుల్లో వీరు పెళ్లి చేసుకున్నారు. నేడు రానా - మిహికల వెడ్డింగ్ డే సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రానా ఇటీవల 'విరాటపర్వం' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. అలానే 'చార్లీ 777' 'గార్గి' వంటి చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. త్వరలో తన బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తున్నారు రానా. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Full View