వీడియో టీజర్: వైజాగ్ పోర్ట్ లో శర్వా హవా

Update: 2019-05-26 06:02 GMT
నిన్న విడుదలైన శర్వానంద్ రణరంగం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్ గా కాకుండా చాలా భిన్నమైన టిపికల్ రోల్ చేసినట్టు అందులో క్లారిటీ వచ్చేయడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దీని తాలూకు పోస్టర్ టీజర్ వీడియో రూపంలో వచ్చింది. సినిమాలోని థీమ్ గురించి చిన్న క్లూ ఇచ్చే ప్రయత్నం దీని ద్వారా చేశారు. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో శర్వా అనుచరుల బ్యాచ్ తో నడిచి వస్తుండగా వెనుక జనం ఫాలో అవుతున్న చిన్న బిట్ ఇందులో పొందుపరిచారు.

అమితాబ్ దీవార్ ప్రభాస్ ఛత్రపతి యష్ కెజిఎఫ్ ఛాయలు కొంత కనిపిస్తున్నప్పటికీ సుధీర్ వర్మ తనదైన టేకింగ్ తో దీన్ని డిఫరెంట్ గా మలిచే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోంది. శర్వాని పూర్తిగా చూపకుండా కొంత మసకగా ఉన్న షాట్ లో చూపించడం మంచి ఇంటెన్సిటీ రేపింది. రణరంగంలో కాజల్ అగర్వాల్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంకా వీళ్ళ తాలూకు లుక్స్ బయట పెట్టలేదు.

దివాకర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న రణరంగంకు ప్రశాంత్ పిళ్ళై సంగీతం ఇస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా అర్జున్ కార్తీక్ సంభాషణలు సమకూర్చారు. ఇతర తారాగణం తదితర వివరాలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది. మొత్తానికి శర్వా చాలా డెప్త్ ఉన్న గ్యాంగ్ వార్ ని చాలా కాలం తర్వాత అటెంప్ట్ చేశాడు. లవ్ స్టోరీస్ ట్రెండ్ కి భిన్నంగా ఎంచుకున్న ఈ రణరంగం ఆగస్ట్ 2న విడుదల రెడీ అవుతోంది. ఆమేరకు ఈ టీజర్ లో కూడా డేట్ ని లాక్ చేస్తూ ఖరారు చేశారు


Full View

Tags:    

Similar News