బాలీవుడ్ జనాలతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ ల వివాహం నేడు జరుగుతుంది. బాలీవుడ్ కు చెందిన అత్యంత ప్రముఖ సెలబ్రెటీలు ఈ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నారు. పెళ్లి తంతును సెక్యూరిటీ కారణాల రీత్యా అత్యంత లో ఫ్రొఫైల్ లో నిర్వహించాలని భావించినట్లుగా సమాచారం అందుతోంది.
పెళ్లి సందర్బంగా రణబీర్ కపూర్ తనకు అత్యంత ఇష్టమైన 8 నెంబర్ ను ఆలియాకు బహుమానంగా ఇచ్చాడట. 8 అనే అక్షరం వచ్చేలా ఒక వజ్రాలు పొదిగిన బ్యాండ్ ను చాలా ఖర్చు చేసి మరీ రణబీర్ కపూర్ చేయించాడట. ఆమె పై తనకు ఉన్న ప్రేమను ఆ బ్యాండ్ లో రణబీర్ కపూర్ చూపించే ఉద్దేశ్యంతో తన లక్కీ నెంబర్ ను ఉపయోగించి.. అందులో తన ప్రేమను కూడా చూపించేలా ప్లాన్ చేశాడట.
రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ ల ప్రేమ వ్యవహారం ఇప్పటిది కాదు. వీరిద్దరు కలిసి చాలా సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరి కుటుబ సభ్యుల నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీడియా ద్వారా జనాలకు వీరి ప్రేమ విషయాన్ని లీక్ చేశారు. పెళ్లి కి అదుగో ఇదుగో ముహూర్తం కుదిరింది అంటూ ప్రచారం జరిగింది. కాని కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.
ఇద్దరు కూడా కెరీర్ లో పీక్స్ లో ఉన్నారు. ఈ సమయంలో పెళ్లి అవసరమా అంటూ కొందరు ప్రశ్నించారు. కాని దీపిక పదుకునే మరియు ప్రియాంక చోప్రా ఇంకా కొందరు స్టార్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. కనుక తాము కూడా పెళ్లి అయ్యాక స్టార్ కపుల్ గా కొనసాగుతామనే ఉద్దేశ్యంతో వీరిద్దరు పెళ్లికి సిద్దం అయ్యారని తెలుస్తోంది.
పెళ్లికి ఎవరు హాజరు అయ్యారు.. ఎంత మంది హాజరు అయ్యారు.. ఎలా పెళ్లి వేడుక జరిగింది అనేది వారు ఫోటోలు లేదా వీడియో విడుదల చేస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా వీరి వివాహం పై ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మరి కొన్ని గంటల్లో వీరి పెళ్లి ఫోటోలు సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.