రణబీర్ కపూర్ -అలియాభట్ జంట పెళ్లికి సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. 5 ఏళ్ల ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెడుతూ పెళ్లి పీఠలెక్కబోతున్నారు. ఇది పెద్దల సమక్షంలో అధికారికంగా జరగబోతున్న పెళ్లి. ఇక ఈ జంట పెళ్లి గురించి అలియాభట్ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి ఎప్పుడని అభిమానులు ప్రశ్నించినప్పుడల్లా మాట దాటేసి అలియా చివరికి రణబీర్ తో పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని అనేసింది.
దాని మీనింగ్ ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నప్పుడే పెళ్లి జరిగిబోయిందని..మళ్లీ కొత్తగా పెళ్లి ఏంటి? అని తాత్కాలికంగా అభిమానుల నోళ్లు మూయించింది. తాజాగా అలియాభట్ చెప్పింది నిజమేనని `కేసరియా` సాంగ్ కన్ఫమ్ చేసింది. ఇద్దరు జంటగా నటిస్తోన్న `బ్రహ్మాస్ర్త - శివం` త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో `కేసరియో` మెలోడి సాంగ్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. క్లాసిక్ మెలోడిలో ఈజంట ఆద్యంతం ప్రేమికులుగా ఆకట్టుకుంది.
రియల్ ప్రేమికుల్ని రీల్ గా చూపించడంలో మేకర్స్ మరింత ఉత్సాహం చూపిస్తారు. కేసరియా పాటలో ఇద్దరి మధ్య ప్రేమ బంధాన్ని చాలా చక్కగా చూపించారు. అందమైన భారీ సెట్ల నడుమ చిత్రీకరించిన పాట ఆద్యంతం విజువల్ గా ఆకట్టుకుంటుంది. ఇందులో జంట శివభక్తులగానూ కనిపిస్తున్నారు. శివుడ్ని కొలిచే కొన్ని సన్నివేశాలు సాంగ్ లో అలా వచ్చి వెళ్తాయి.
ఆ సమయంలో జంటగా శివుడి ఆశీస్సులు పొందడం వంటి సన్నివేశాన్ని పరిశీలించగల్గితే శివ ఆజ్ఞతోనే ఈ జంట పెళ్లి జరిగిపోయిందా? అన్నంతగా పాటలో చూపించారు. ఓ నెటి జనుడు ఆసక్తికర కామెంట్ చేసాడు. ఈ పాటలోనే ఇద్దరి పెళ్లి అయిపోయిందని..ఇప్పుడు రియల్ గా పెళ్లి చేసుకుంటున్నారని సరదా కామెంట్ పెట్టాడు.
ఈ పాటలో సందర్భాన్ని ఉద్దేశించే అలియాభట్ ఇద్దరికీ ముందే పెళ్లి అయిపోయింది అన్నట్లుందని తెలుస్తోంది. ఆ సంగతి పక్కన బెడితే కేసరియా సాంగ్ మెలోడీ లవర్స్ ని ఫిదా చేస్తుంది. చక్కని సాహిత్యం..వినసొంపైన ట్యూన్స్ మ్యూజిక్ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Full View