ఆన్ స్క్రీన్ పై ప్రేమికులుగా నటించిన వాళ్లు.. ఆఫ్ స్క్రీన్ లోనూ ప్రేమాయణం నడపడం కొత్తేమీ కాదు. అయితే తెరపై మాదిరిగానే రియల్ లైఫ్ లోనూ బోలెడన్ని ట్విస్టులు ఎదురయ్యి.. బ్రేకప్ లు అయిపోతూ ఉంటాయి. కానీ రియల్ లైఫ్ లవ్ స్టోరీలకు శుభం కార్డు పడడం.. సినిమాలో సుఖాంతం అయిన తేలిక కాదు.
బాలీవుడ్ స్టార్స్ అయిన రణబీర్ కపూర్- దీపికా పదుకొనే ప్రేమాయణం గురించి తెలిసిన విషయమే. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నా.. ఓ సినిమాలో కలిసి నటించారు కూడా. అయితే.. ముందుగా ఒప్పుకున్న కమిట్మెంట్ కావడంతోనే కలిసి యాక్ట్ చేయాల్సి వచ్చింది. మరి వీరిద్దరూ నిజంగా ఎదురైతే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది.. ఈ ప్రశ్నకు రీసెంట్ గా జవాబు దొరికేసింది. ఓ ఈవెంట్ లో రణబీర్ కపూర్.. దీపికలు ఒకరికొకరు తారసపడ్డారు. పక్కనే కరణ్ జోహార్ ఉన్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు కుశల ప్రశ్నలు వేసుకుని పలకరించారు.
అంతే కాదు.. చివరగా ఆమెను కౌగిలించుకుని మరీ ఆప్యాయతను చాటాడు రణబీర్ కపూర్. దీపిక కూడా ఇందుకు అభ్యంతరాలు ఏమీ చెప్పకపోగా.. చాలా హ్యాపీగా కనిపించింది. పాత కబుర్లు అన్నీ పక్కన పెట్టేసి.. ఇప్పుడు ఫ్రెష్ గా బోలెడంత ప్రొఫెషనల్ గా కనిపించింది. ఈవెంట్ కు ఎలా వచ్చిందో.. అదే చిరునవ్వుతో తిరిగి వెళ్లిపోయింది కూడా. అవతలి వ్యక్తి మాజీ లవర్ అయినా.. ఏ మాత్రం మొహమాటపడకుండా వీరు ప్రవర్తించిన తీరు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.