ఫస్ట్‌ లుక్‌ లోనే పడిపోయాడంతే!!

Update: 2015-12-10 09:30 GMT
ర‌ణ‌బీర్ క‌పూర్ - దీపిక ప‌దుకొన్ ఈ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణం గురించి ర‌క‌ర‌కాల క‌బుర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే అస‌లు ఈ ఇద్ద‌రిమ‌ధ్యా ప్రేమ ఎప్పుడు పుట్టింది? ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైటేనా?  లేక క్యాజువ‌ల్ డేటింగేనా? ఇలాంటి ఆస‌క్తిక‌ర విష‌యాల‌కు ఇంత‌కాలం స‌రైన స‌మాధాన‌మే ల‌భించ‌లేదు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇప్ప‌టికే మూడు సినిమాల్లో న‌టించారు. అంత‌కంటే  ముందే ఈ ఇద్ద‌రూ విడిపోయి స్నేహితులుగా కెరీర్‌ ని సాగిస్తున్నారు.

లేటెస్టుగా త‌మాషా మూవీతో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డం వెన‌క ఈ జోడీ రొమాన్స్ ఆన్‌ స్ర్కీన్ వ‌ర్క‌వుట‌వ్వ‌డ‌మేన‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇద్ద‌రిమ‌ధ్యా సింకు అంత బాగా కుదిరింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ ఆఫ్ ద స్ర్కీన్ ప్రేమికులు మాత్రం కాదు. కేవ‌లం ఆన్ ద స్ర్కీన్ మాత్ర‌మే. ప్రేమించుకోవ‌డం - విడిపోవ‌డం - అటుపై ర‌ణ‌బీర్ క‌త్రిన తో ప్రేమ‌లో ప‌డ‌డం, దీపిక ర‌ణ‌వీర్ సింగ్ ప్రేమ‌లో ప‌డ‌డం ఇవ‌న్నీ హాలీవుడ్ సినిమాలో ప్రేమ‌ల్లా చాలా స్పీడ్‌ గా జ‌రిగిపోయాయి. ఏదైతేనేం అస‌లు ర‌ణ‌బీర్ - దీపిక మ‌ధ్య మొద‌టిసారి ప్రేమ ఎలా పుట్టింది? అన్న దానికి ఆ ఇద్ద‌రూ చెప్పుకొచ్చిన స‌మాధాన‌మిది.

అప్పుడు షారుక్‌ ఖాన్ సొంత ప్రొడ‌క్ష‌న్‌ లో ఓం శాంతి ఓం తెర‌కెక్కుతోంది. అందులో దీపిక ప‌దుకొన్ క‌థానాయిక‌. షారూక్ క‌థానాయ‌కుడు. ఓ కీల‌క స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ర‌ణ‌బీర్ ఓచోట‌ - దీపిక మ‌రోచోట షూటింగుల్లో పాల్గొని ఎవ‌రికి వారు బిజీగా ఉన్నారు. ఆ టైమ్‌ లో దీపిక విరామ స‌మ‌యంలో త‌న వ్యాను ద‌గ్గ‌ర‌కు వెళుతుంటే ర‌ణ‌బీర్ ఎవ‌రీ అంద‌గ‌త్తె అంటూ త‌న‌నే త‌థేకంగా చూశాడు. అంతే.. ఇక మ‌నోడు ప‌డిపోయాడు. వెంట‌నే దీపిక ఫోన్ నెంబ‌ర్ వేరే వారి నుంచి అడిగి తీసుకుని ఫాలో అప్ మొద‌లెట్టాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ ఎపిసోడ్‌ లో ర‌ణ‌బీర్ తొలి చూపులోనే మ‌న‌సు పారేసుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. 2007లో ఈ వ్య‌వ‌హారం అంతా సాగింద‌న్న‌మాట‌!

Tags:    

Similar News