సంజూ స్పూఫ్ లు అదిరిపోయాయి

Update: 2018-06-12 17:30 GMT
సినిమాల్లో ఎక్కువగా క్రియేటివిటీ కనిపిస్తుంది అనడం కరెక్ట్ కాదు. సోషల్ మిడియలో కూడా బడా దర్శకులకంటే బాబులు ఉన్నారు. బడా సినిమాలను వారు స్పూఫ్ చేసిన విధానానికి నిజంగా ఫిదా అవ్వకుండా ఉండలేము. ఎక్కువగా ట్రైలర్స్ టీజర్స్ ను ఈ మధ్య చాలా మంది సొంత క్రియేటివిటీ తో డిజైన్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు.  రీసెంట్ గా బాలీవుడ్ సినిమా సంజూ ట్రైలర్ పై కూడా అనేక రకాల స్పూఫ్స్ దర్శనమిస్తున్నాయి.

అయితే ఎక్కువగా రెండు మాత్రం నెటీజన్స్ ను బలే ఆకట్టుకుంటున్నాయి. సంజయ్ దత్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సంజూ టీజర్ - ట్రైలర్ లో రన్ వీర్ సింగ్ ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో అందరికి తెలిసిందే. మొదట టీజర్ ను గంజు పేరుతో ది స్క్రీన్ పత్తి టీమ్ చేసింది. ఇక ట్రైలర్ ను మంజు పేరుతో గిర్లీయాప అనే టీమ్ అద్భుతంగా స్పూఫ్ చేసింది.
టీజర్ లో హెయిర్ ఫాల్ కోణంలో చూపించి ప్రతి పాత్రను బాగా కవర్ చేశారు. ఏ డైలాగ్ కూడా మిస్ అవ్వలేదు. ఇక మంజు లో కూడా ఇక పని మనిషి కాన్సెప్ట్ ని తీసుకొని వావ్ అనిపించారు. మగాళ్లు సంజూ స్పూఫ్ చేయడం చాలా రెగ్యులర్ గాని ఇలా ఒక అమ్మాయితో చేయడం డిఫరెంట్ అని చెప్పాలి.

ట్రైలర్ లో ఉన్న డైలాగులను కవర్ చేస్తూ అతి ముఖ్యమైన సన్నివేశాలను కూడా స్పూఫ్ లో మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ముఖ్యంగా సంజయ్ జైల్లో ఉన్నప్పుడు బాత్రూమ్ సీన్ కు తగ్గట్టుగా మంజు లో కిచెన్ రూమ్ ను చూపించడం నిజంగా చాలా బాగా చేశారని మచ్చుకోవాలి. ఆమె చూపించిన హావభావాలు రన్ వీర్ నటనకు మ్యాచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ రెండు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సంజూ సినిమా జూన్ 29న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.




Tags:    

Similar News