వీళ్ళిద్దరూ విడిపోలేదా? జస్ట్ నటిస్తున్నారా?

Update: 2016-08-08 15:30 GMT
బాలీవుడ్ లో ఎప్పుడు ఏ ఎఫైర్ ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది పెళ్ళయిన చాలా ఏళ్ళకు డివోర్స్ తీసుకుంటే.. కొందరు ఏళ్ళతరబడి లివ్ ఇన్ రిలేషన్లో ఉండి కూడా తరువాత విడిపోతున్నారు. అలాంటి లిస్టులో రణబీర్ కపూర్ అండ్ కత్రినా కైఫ్‌ కూడా ఉన్నారులే.

ఇటీవల కత్రిన కైఫ్‌ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యింది. అక్కడి కత్రినా కోజ్ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు.. ఒక వ్యక్తిని చూసి షాకైందని తెలుస్తోంది. ఒక బాలీవుడ్ మీడియా రాసిన కథనం ప్రకారం..  అపార్ట్‌మెంట్‌ కు మారిన కత్రినాను కలిసేందుకు ఆమె స్నేహితురాలు వచ్చింది. కత్రినతో మాట్లాడిన తర్వాత ఆమె వెళ్లబోతుండగా.. అప్పుడే రణ్‌ బీర్‌ గప్‌ చుప్‌ గా ఇంట్లోకి వచ్చాడట. ఇది చూసి ఆమె స్నేహితురాలు విస్మయపోయినప్పటికీ.. కత్రిన మాత్రం రణ్‌ బీర్‌ వస్తాడని ముందే తెలిసినట్టు బిహేవ్ చేసిందని ఆ కథనం చెబుతోంది. ఇది చదివితే అందరికీ వచ్చే సందేహం ఏంటంటే.. వీళ్ళిద్దరూ విడిపోలేదా? జస్ట్ నటిస్తున్నారా? అనే.

కాకపోతే ఇక్కడ మనం సందేహపడాల్సిన ఒక విషయం ఏంటంటే.. అసలు కత్రినా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు.. ఆమెకు రణబీర్ తో బ్రేకప్ అయ్యిందో లేదో తెలియందంటారా? మొత్తానికి సంచలన కథనాలను తెలుసుకుని రాస్తున్నారో లేకపోతే చీకట్లో రాయేసి నిజం రాబట్టాలని ఇలా సృష్టిస్తున్నారో తెలియట్లేదు.

Tags:    

Similar News