బాలీవుడ్ లో బ్రేకప్ స్టోరీలు చాలానే ఉంటాయ్ కానీ.. ఓ జంట విడిపోవడాన్ని మాత్రం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. న్యూ ఇయర్ వరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ లు సడెన్ గా విడిపోయి.. ఎవరికివారే అన్నట్లుగా మారిపోయారు. అసలు 2016కు వీళ్ల బ్రేకప్ తోనే బాలీవుడ్ వెల్ కం చెప్పింది. వీళ్లెందుకు విడిపోయారనే విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు కానీ.. ఈ బ్రేకప్ కారణంగా తన గుండె పగిలిపోయిందని అంటున్నాడు రణబీర్.
రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ లు ఆరేళ్లకు పైగా ప్రేమించేసుకున్న జంట. ఇంత సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్నాక విడిపోవడమంటే చిన్న విషయం కాదు. 'మా రిలేషన్ కి చాలా అంశాలు తూట్లు పొడిచాయి. ఆధారం లేని రూమర్లు.. రిపోర్టులు.. అంచనాల కారణంగా విబేధాలు తలెత్తాయి' అన్న రణబీర్.. 'నా పేరెంట్స్ తర్వాత నా లైఫ్ లో అత్యంత ముఖ్యమైన.. ప్రభావం చూపే వ్యక్తి ఆమే అనుకోవడంతో.. ఈ సంఘటన నన్ను బాగా కలచివేసింది' అంటూ ఓపెన్ అయిపోయాడు రణబీర్ కపూర్.
తామిద్దరూ తిరిగి కలుస్తున్నట్లు.. ప్రత్యేకంగా మీట్ అయినట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లే అన్న రణబీర్.. ఈ మధ్య కాలంలో కత్రినాని కలవలేదన్నాడు. కానీ త్వరలో మీట్ అవుతానంటూ.. డేట్ కూడా ఇచ్చాడు. 'సెప్టెంబర్ 10న మేమిద్దరం కలవొచ్చు. ఎందుకంటే ఆ రోజు నుంచి జగ్గా జాసూస్ షూటింగ్ మొదలవుతుంది' అంటూ డీటైల్స్ చెప్పాడీ కుర్ర హీరో.