టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మా హిట్ సూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. వెంటనే తన తదుపరి సినిమా 'రంగ్ దే' పై దృష్టి పెట్టాడు. ఇక ఈరోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులను వేడుకలు జరుపుకోకండి అని పిలుపిచ్చిన నితిన్.. ప్రస్తుతం కుటుంబంతో చిన్నపాటి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాడట. ఇక నితిన్ బర్త్ డే సందర్భంగా నిన్న సాయంత్రం 4గంటలకు 'రంగ్ దే' సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా నవ్వు ముఖాలతో ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక పోస్టర్ లో హీరోయిన్ కీర్తిసురేష్ గ్రీటింగ్స్ తెలుపుతుండగా, హీరో నితిన్ హీరోయిన్ తో తన లైఫ్ ని ఊహించుకుంటున్నట్లుగా అన్పిస్తుంది. ఈ సినిమాలో అను పాత్రలో కీర్తి అని, అర్జున్ పాత్రలో నితిన్ నటిస్తున్నట్లు రివీల్ చేసారు దర్శక నిర్మాతలు. అంతేగాక ఈ సినిమాలో నితిన్ తన ప్రియురాలి కోసం ఎదురుచూసే 24యేళ్ళ కుర్రాడిగా, కీర్తి సురేష్ హీరో కోసం వచ్చే ప్రియురాలిగా కన్పించనున్నారు. ఈ సినిమాకు తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, జెర్సీ లాంటి భారీ విజయాన్ని అందుకున్న సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.Full View
ఇక పోస్టర్ లో హీరోయిన్ కీర్తిసురేష్ గ్రీటింగ్స్ తెలుపుతుండగా, హీరో నితిన్ హీరోయిన్ తో తన లైఫ్ ని ఊహించుకుంటున్నట్లుగా అన్పిస్తుంది. ఈ సినిమాలో అను పాత్రలో కీర్తి అని, అర్జున్ పాత్రలో నితిన్ నటిస్తున్నట్లు రివీల్ చేసారు దర్శక నిర్మాతలు. అంతేగాక ఈ సినిమాలో నితిన్ తన ప్రియురాలి కోసం ఎదురుచూసే 24యేళ్ళ కుర్రాడిగా, కీర్తి సురేష్ హీరో కోసం వచ్చే ప్రియురాలిగా కన్పించనున్నారు. ఈ సినిమాకు తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, జెర్సీ లాంటి భారీ విజయాన్ని అందుకున్న సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.