నాలుగు సంవత్సరాల తర్వాత నితిన్ కు ‘భీష్మ’ చిత్రంతో సక్సెస్ దక్కింది. ఈ ఏడాది ఆయనకు లక్కీ అంటున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం మంచి సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో ఆయన తర్వాత సినిమా రంగ్ దే పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఫస్ట్ లుక్ వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే రంగ్ దే భీష్మ తరహాలో సక్సెస్ అవుతుందని నితిన్ అభిమానులు అంటున్నారు.
తాజాగా బర్త్ డే సందర్బంగా నితిన్ మాట్లాడుతూ రంగ్ దే చిత్రంపై తనకు చాలా నమ్మకం ఉందని అన్నాడట. రంగ్ దే మరో భీష్మ అవుతుందో లేదో చెప్పలేను కాని ఇష్క్ లా మంచి విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకంతో ఉన్నానంటూ సన్నిహితుల వద్ద నితిన్ అంటున్నాడట. ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నారంటూ ప్రశ్నించగా ఆయన సమాధానంగా ఇష్క్ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పుడు రంగ్ దే సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అందుకే నాకు నమ్మకం అంటూ లాజిక్ లేని సెంటిమెంట్ ను చెబుతున్నాడు.
పీసీ శ్రీరామ్ నాకు లక్కీ అంటూ నితిన్ అంటున్నాడు. మరి నితిన్ భావించినట్లుగా పీసీ శ్రీరామ్ లక్ తో రంగ్ దే కూడా సక్సెస్ అయ్యేనో చూడాలి. చాలా కాలం తర్వాత భీష్మతో సక్సెస్ వచ్చింది కనుక రంగ్ దే కూడా హిట్ అయితే నితిన్ కెరీర్ మరింతగా దృడంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తన మొదటి సినిమా తొలిప్రేమ తరహాలో ఒక మంచి ప్రేమ కథతో ఈ చిత్రాన్ని వెంకీ తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమ్మర్ లోనే రంగ్ దే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కరోనా క్రైసిస్ కారణంగా సినిమా సమ్మర్ లో విడుదల అవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఏం జరగబోతుందో చూడాలి.