తమిళ స్టార్ నటుడు మాధవన్ ఇటీవలే రాకేట్రీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకున్నా కూడా మంచి పేరు అయితే రాబట్టింది. హీరో గా మాధవన్ ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించాడు.
కాని మాధవన్ రాకేట్రీ సినిమా పై చాలా శ్రద్ద కనబర్చాడు. ఎన్నో విధాలుగా సినిమా కోసం కష్టపడ్డాడు. రాకెట్రీ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందంటూ ప్రమోషన్ సందర్భంగా మాధవన్ పేర్కొన్నాడు.
తాజాగా మరోసారి మాధవన్ కు సంతోషం కలిగింది. ఆయన తనయుడు ఏకంగా జాతీయ రికార్డు ను నెల కొల్పడంతో పుత్రోత్సాహం లో మునిగి తేలుతున్నాడు. మాధవన్ తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ ఛాంపియన్ అనే విషయం తెల్సిందే. ఇప్పటికే పలు టోర్నమెంట్ లో పథకాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయిలో నెం.1 గా వేదాంత్ నిలిచిన విషయాన్ని స్వయంగా మాధవన్ తెలియజేశాడు.
వేదాంత్ తాజాగా నేషనల్ జూనియర్ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో ఉన్న రికార్డును వేదాంత్ బ్రేక్ చేశాడట. మాధవన్ వీడియోను షేర్ చేసి మరీ తన కొడుకు యొక్క విజయాన్ని అందరికి తెలియజేశారు. 16 నిమిషాల్లో 780 మీటర్ల మార్క్ వద్ద ఇప్పటి వరకు అద్వైత్ పేజ్ పేరుతో ఉన్న రికార్డు ను వేదాంత్ బద్దలు కొట్టినట్టు ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఏదీ చేయలేము అని ఎప్పుడు కూడా అనుకోకూడదు.. మనని మనం తప్పుగా.. తక్కువగా చేసుకోకుండా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధ్యం అవుతుందని మాధవన్ చెప్పుకొచ్చాడు. వేదాంత్ విజయాన్ని మాధవన్ అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా మంది చాలా రకాలుగా మాధవన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.
ఇన్నాళ్లు వేదాంత్ మీ కొడుకు అవ్వడం వల్ల అతడికి గర్వం.. ఇప్పుడు వేదాంత్ మీ తనయుడు అవ్వడంతో మీరు గర్వపడాలి అంటూ మాధవన్ పోస్ట్ కు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉండగా.. మాధవన్ పుత్రోత్సాహంతో ఎగిరి గంతేసినంత ఆనందంగా ఉన్నాడట.

Never say never .