రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. భారతీయుడు 2 తో పాటుగా ఆర్.సి15 ని సైమల్టేనియస్ గా శంకర్ పూర్తి చేస్తుండడం ఆసక్తికరం. భారీ బడ్జెట్ చిత్రం ఆర్.సి 15 పూర్తయితే చరణ్ నటించే తదుపరి సినిమా ఏది? అంటే ... 'రంగస్థలం 2' కోసం అతడు సన్నాహకాల్లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణ ముగించి తదుపరి రంగస్థలం సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సుక్కూ ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
నిజానికి సుకుమార్ పుష్ప 2 పూర్తి చేసిన తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అది ఆలస్యమవుతుందని అంతకంటే ముందే రంగస్థలం 2 ని తెరకెక్కించి పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేస్తారని కూడా గుసగుస వినిపిస్తోంది. పుష్ప తో సంచలన దర్శకుడిగా బాలీవుడ్ లో సుక్కూకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప 2 ని మరింత భారీ కాన్వాస్ తో తెరకెక్కించి అన్ని భాషల్లోనూ విడుదల చేసి సత్తా చాటాలన్నది సుకుమార్ ప్లాన్. ఇప్పటికే హిందీలో తన సినిమాలకు గిరాకీ పెరిగింది. దీంతో 'రంగస్థలం 2' కి కూడా అది పెద్ద ప్లస్ అవుతుంది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్. తదుపరి శంకర్ తో ఆర్.సి 15 ని పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేసి బంపర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఆ వెంటనే పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ తో రంగస్థలం 2 చేస్తే అది తనకు పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రంగస్థలం డబ్బింగ్ ను హిందీ ఆడియోన్ వీక్షించారు. ఓటీటీల్లోను అందుబాటులో ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు చరణ్ నటన నచ్చింది. ప్రశంసలు దక్కాయి. అందువల్ల రంగస్థలం సీక్వెల్ తెరకెక్కించడానికి ఇదే సరైన సమయం అని టీమ్ భావిస్తోందిట.
రంగస్థలం సీక్వెల్ గురించి సుకుమార్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ముచ్చటించారని కూడా గుసగుస వినిపిస్తోంది. సినిమా చివర్లో రామ్ చరణ్ పోషించిన పాత్ర నిజానికి ఊరి పెద్ద అయిన ప్రకాష్ రాజ్ ని చంపి గ్రామం వదిలి వెళ్లిపోతుంది. అక్కడ నుండి చిట్టి బాబు ప్రయాణం ఎలా సాగింది? అనే ఒక కొత్త ఆలోచనను సుక్కూ అభివృద్ధి చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. తాజా కథనాల ప్రకారం.. ఈ మూవీ కథాంశం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పాన్ ఇండియా అప్పీల్ తో ఉంటుంది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ ఇమేజ్ అమాంతం మారింది. దానికి తగ్గట్టుగానే గ్రాండియర్ స్కేల్ లోనే రంగస్థలం 2 ని తెరకెక్కించేందుకు అవకాశం ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమండ్రిలో శంకర్ తో #RC15 షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసాడని సమాచారం. సుకుమార్ పుష్ప 2 షెడ్యూళ్ల కోసం భారీ ప్రణాళికలతో ఉన్నాడు. త్వరగా ఆ ఇద్దరూ తమ కమిట్ మెంట్లు పూర్తి చేసి రంగస్థలం 2 కోసం కలుస్తారని తెలుస్తోంది.
కాంతార ఇచ్చిన ఐడియా ఇది!రిషబ్ శెట్టి నటించిన కన్నడ సినిమా 'కాంతారా' ప్రస్తుతం చరణ్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా థీమ్ లైన్ ఇంచుమించుగా రంగస్థలం లైన్ ని పోలి ఉంది. ఇందులో జానపద ఎలిమెంట్స్ థ్రిల్లర్ మోడ్ ని వదిలేస్తే ఇతర కథాంశం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కాంతార ఇప్పుడు పాన్ ఇండియా కేటగిరీలో విడుదలై విజయం సాధించింది. నిజానికి రంగస్థలం సినిమాని కూడా పాన్ ఇండియా రేంజులో విడుదల చేసి ఉంటే విజయం సాధించేదని చెర్రీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కానీ అలా జరగలేదు. చాలా గ్యాప్ తర్వాత అనువదించి రిలీజ్ చేసినా హిందీ ఆడియెన్ అప్పటికే ఓటీటీల్లో వీక్షించారు. దానివల్ల మ్యాజిక్ జరగలేదు. కానీ ఇప్పుడు అలా కాకుండా రంగస్థలం 2 ని తెరకెక్కించి సైమల్టేనియస్ గా అన్ని భాషల్లో విడుదల చేస్తే కాంతార తరహాలోనే మ్యాజిక్ చేయడం ఖాయమని సుకుమార్ సహా అందరూ నమ్ముతున్నారని టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.