రంగస్థలం మూవీ సెన్సేషన్స్ గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన టాలీవుడ్ బిగ్గీస్ తో పోల్చితే.. రంగస్థలంను లిమిటెడ్ గానే థియేటర్లకు ఇచ్చారు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో చరణ్ కు కెరీర్ బెస్ట్ అని తప్ప.. వేరే రికార్డ్ ఏదీ నమోదు కాలేదు. కానీ కథ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రెండో రోజు నుంచి రంగస్థలం బాక్సాఫీస్ ను దున్నిపారేస్తోంది. బాహుబలి2 మినహాయిస్తే.. మరే ఇతర చిత్రంతో పోల్చినా 2..3..4..5 రోజుల వసూళ్లు వచ్చాయి.
వారం మధ్యలో కూడా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి 5 కోట్లకు పైగా వసూళ్లు వస్తున్నాయంటే రంగస్థలం ఏ రేంజ్ స్ట్రాంగ్ గా ఉందో అర్ధమవుతుంది. మొత్తం 5 రోజులకు గాను రంగస్థలం వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం - 14.37 కోట్లు
ఉత్తరాంధ్ర - 6.79 కోట్లు
తూర్పు గోదావరి - 4.54 కోట్లు
పశ్చిమ గోదావరి - 3.45 కోట్లు
కృష్ణా - 4.02 కోట్లు
గుంటూరు - 5.50 కోట్లు
నెల్లూరు - 1.80 కోట్లు
కోస్తా జిల్లాలు - 26.10 కోట్లు
సీడెడ్ - 9.55 కోట్లు
ఏపీ+తెలంగాణ - 50.02 కోట్లు
యూఎస్ఏ - 10,26 కోట్లు
కర్నాటక - 5.90 కోట్లు
రెస్టాఫ్ ఏరియాస్ - 4.35 కోట్లు
మొత్తం - 70.53 కోట్లు
ఐదంటే ఐదు రోజుల్లో 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది రంగస్థలం. గ్రాస్ లెక్క అయితే 111.8 కోట్లు వచ్చాయి. థియేట్రికల్ రైట్స్ ను 80 కోట్లకు విక్రయించగా.. ఈమొత్తం తొలివారంలోనే వచ్చేయడం ఖాయమైపోయింది. పలు ఏరియాల్లో ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి కూడా సినిమా వచ్చేసింది.
పైగా బాహుబలి 1.. బాహుబలి 2.. ఖైదీ నంబర్ 150 చిత్రాలను మినహాయిస్తే.. మిగిలిన ఏ తెలుగు సినిమాకి అయినా సరే.. తొలి వారం వసూళ్లను ఐదు రోజుల్లోనే దాటేసింది రామ్ చరణ్ మూవీ. రంగస్థలం సృష్టిస్తున్న ఈ ప్రభంజనం చూస్తుంటే.. ఓరయ్యో.. ఇవేం రికార్డులయ్యో అనుకోవాల్సిందే.