మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రోజుకి అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. అంతే కాకుండా పాటలతో దేవి శ్రీ సినిమా బిజినెస్ ని కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.
లోకల్ గానే కాకుండా నాన్ లోకల్ మెగా ఫ్యాన్స్ కి కూడా తెగ నచ్చేశాయి. ముఖ్యంగా మన ప్రవాసులు తెలుగు సినిమాలు వస్తే ఏ మాత్రం మిస్ అవ్వరు అనేది అందరికి తెలిసిన విషయమే. అమెరికాలో తెలుగు ప్రేక్షకులు బలంగా ఉన్నారని మిలియన్ డాలర్ల బాక్స్ ఆఫీస్ వసూళ్లతో గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు రంగస్థలం సినిమాపై కూడా ఓవర్సీస్ లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యూఎస్ లో రెగ్యులర్ గా తెలుగు సినిమాలను చూసే వారి సంఖ్యతోనే సినిమా హాఫ్ మిలియన్స్ ని ఈజీగా దాటేస్తుందని చెప్పవచ్చు.
ఇక మెగా పవర్ స్టార్ లాంటి హీరో సినిమా వస్తోంది అంటే లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో కూడా అర్థం చేసుకోవచ్చు. అందులోనూ సుకుమార్ దర్శకత్వంలో వస్తుండడం మేజర్ ప్లస్ పాయింట్. సుకుమార్ సినిమాలకు కూడా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కల కన్నా ఎనలిస్ట్ లు యూఎస్ కలెక్షన్స్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా రోజుల తరువాత ఒక పెద్ద సినిమా వస్తుండడం అలాగే సెలవుల్లో రావడంతో సినిమాకు అన్ని కలిసొచ్చే అంశాలే కనిపిస్తున్నాయి. కాని సుకుమార్ ఏమాత్రం తేడా చేసినా.. 1 నేనొక్కడినే తరహాలో సినిమాలో ఏదన్నా కొత్తరకం స్ర్కీన్ ప్లే ఉంటే మాత్రం.. గోవిందా గోవిందా అనుకోవాల్సి వస్తుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు.