రంగస్థలం పుణ్యమా అని ప్రేక్షకులు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నారు. కొత్త తరం అప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవా అని ఆశ్చర్యభరితులవుతుంటే అప్పటి విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు తమ మెమోరీస్ ని అందరితో షేర్ చేసుకుంటున్నారు. నిజానికి కొంత అవుట్ డోర్ షూటింగ్ తప్ప మిగిలిన భాగం సినిమా మొత్తం జూబ్లీ హిల్స్ లో వేసిన రంగస్థలం ఊరి సెట్ లో తీసిన సంగతి తెలిసిందే. ఆర్ట్ డైరెక్షన్ చేసిన రామకృష్ణ-మౌనికలకు జాతీయ అవార్డు రావడం ఖాయమని సినిమా చూసిన అధిక శాతం అభిప్రాయం వ్యక్తం చేసారు కూడా. ఇప్పుడు ఆ సెట్ కు జనాల తాకిడి ఎక్కువైంది. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు బయటివాళ్ళు రాకుండా చర్యలు తీసుకున్న యూనిట్ ఇప్పుడు అక్కడ పనేమీ లేదు కాబట్టి సక్సెస్ ఎంజాయ్ చేస్తూ అక్కడి పరిస్థితిని నిర్లక్ష్యం చేసింది.
ఇప్పుడు అది విజిటర్స్ స్పాట్ గా మారిపోయింది. పలు టీవీ ఛానల్స్ అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా యూనిట్ తో ఇంటర్వ్యూలు చేయటంతో పాటు అదే పనిగా విజువల్స్ ని టెలికాస్ట్ చేయటంతో నగరవాసులు తమకు ఇంత దగ్గరలో ఉన్న రంగస్థలాన్ని చూడాలన్న ఉద్దేశంతో పొలోమని వచ్చేస్తున్నారు. దీంతో అనుమతి పరంగా ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో పబ్లిక్ హ్యాపీగా ప్రవేశిస్తున్నారు. దీంతో అక్కడున్న వాటి సెక్యూరిటీ పెద్ద సమస్య మారి సెట్స్ తో పాటు అందులో భాగంగా వేసిన విగ్రహాలు, కట్టడాలు అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. పైగా ఫోటోలు దిగే ఉత్సాహంతో కొందరు విచిత్ర విన్యాసాలు చేయటంతో మొత్తం చిందరవందరగా మారే అవకాశం ఉంది.
దీన్ని అర్జెంటుగా కాపాడే చర్యలు చేపడితే బెటర్. బాహుబలి-భాగమతి-మర్యాద రామన్న సెట్స్ వేసినప్పుడు కూడా ఇలాంటి సమస్యే వస్తే నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కాని జూబ్లీ హిట్స్ లో వేసిన రంగస్థలం సెట్ విషయంలో అలాంటి కేర్ తీసుకోకపోవడంతో ఓపెన్ టు ఆల్ అయిపోయింది. పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ స్పూఫ్స్ తీయటం మొదలుపెట్టారు ఔత్సాహికులు.