ఓ డైరెక్టర్ - ఓ హీరో కలిసి ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీసారంటే.. ఆ తర్వాత నుండి వారిని స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ అంటుంటారు అభిమానులు. అలాంటి స్టార్డం అందుకున్న టాలీవుడ్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఒకటి మెగాపవర్ స్టార్ రాంచరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. వీరిద్దరూ కలిసి తెరకెక్కిన సినిమా రంగస్థలం. 2018లో బ్లాక్ బస్టర్ విజయంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది రంగస్థలం. ఈ సినిమాతో రాంచరణ్ నటుడిగా మరో స్థాయికి చేరుకున్నాడు. అలాగే ఈ సినిమాతోనే సుకుమార్ కూడా కేవలం స్టైలిష్ సినిమాలు మాత్రమే కాకుండా రియలిస్టిక్ సినిమాలు కూడా తీయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వీరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ వీరిద్దరూ కలిసి మళ్లీ రంగస్థలం సీక్వెల్ తీయబోతున్నారని పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రంగస్థలం సినిమాను మరోసారి కదిలించే ప్రయత్నం చేస్తే మాత్రం దెబ్బడిపోతారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రంగస్థలం అనేది ఓ ట్రెండ్ సెట్టర్. అలాంటి సినిమాకు సీక్వెల్ తీయాలంటే ఆ ఫ్లేవర్ పోకుండా చూసుకోవాలి. మరి ఏమాత్రం తేడా కొట్టినా సినిమా ఫలితం బోల్తాకొట్టే అవకాశం ఉంది. అందుకే రంగస్థలం సీక్వెల్ కాకుండా ఏదైనా పర్వాలేదు అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సుకుమార్ పుష్పతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా కన్ఫర్మ్ చేసాడు. అలాగే రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య, శంకర్ సినిమాలు ఓకే చేసాడు. కాబట్టి వీరి కాంబో ఇప్పట్లో రాదు దానికి చాలా సమయం ఉంది. చూడాలి మరి సుక్కు - రాంచరణ్ ఈ విషయం పై స్పందిస్తారేమో!