వీక్ డేస్ లోనూ వీక్ అవ్వలేదే..

Update: 2018-04-03 15:30 GMT
ఒక సినిమా సత్తా ఏంటన్నది తొలి రోజు.. తొలి వీకెండ్ ఓపెనింగ్స్ ను బట్టి ఒక అంచనాకు వచ్చేయలేం. పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ తొలి రోజు ఏకంగా రూ.40 కోట్ల దాకా షేర్ రాబట్టింది. కానీ తర్వాతి రోజు నుంచే సినిమా తుస్సుమనిపించేసింది. వీకెండ్ తర్వాత సోయిలో లేకుండా పోయింది. ఏ సినిమా అయినా హిట్టా లేదా అన్నది సోమవారం తెలుస్తుంది. మండే టెస్టును పాసైతే సినిమా నిలబడ్డట్లే అన్నమాట. ఈ పరీక్షలో ‘రంగస్థలం’ విజయవంతమైంది. సోమవారం కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.6 కోట్లకు పైగా ఈ చిత్రానికి షేర్ రావడం విశేషం. ఇది చాలా పెద్ద ఫిగరే.

మంగళవారం సైతం ‘రంగస్థలం’కు షేర్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తుందని భావిస్తున్నారు. వీక్ డేస్ అంతా ఇలాగే సినిమా హోల్డ్ చేయగలిగితే.. రెండో వీకెండ్లో ఎలాగూ మంచి వసూళ్లే వస్తాయి. నితిన్ సినిమా ‘చల్ మోహన్ రంగ’ వస్తున్నప్పటికీ దానికి పాజిటివ్ టాక్ వచ్చినా అది కొంచెం క్లాస్ మూవీ కాబట్టి మాస్ ఏరియాల్లో ‘రంగస్థలం’ జోరు కొనసాగే అవకాశముంది. పరిస్థితి ఇలాగే సానుకూలంగా సాగితే రెండో వారాంతం అయ్యేసరికి ‘రంగస్థలం’ బ్రేక్ ఈవెన్ కు వచ్చేయొచ్చు. రూ.80 కోట్ల షేర్ మార్కును అందుకుంటే బయ్యర్లు సేఫ్ అయిపోతారు. అంతే కాదు.. ‘మగధీర’ కలెక్షన్ల రికార్డు కూడా బద్దలై ‘రంగస్థలం’ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది.
Tags:    

Similar News