మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ పవర్ ఎంతో చాటిచెప్పిన చిత్రం 'రంగస్థలం'. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ చట్రాన్ని దాటుకొని, ఫార్ములా చిత్రాలను పక్కకు నెట్టి, కేవలం పెర్మార్మెన్స్ మీద బేస్ అయిన చిత్రం చేశాడు చెర్రీ. ఈ మూవీ చూసిన తర్వాత.. చెవులు సరిగా వినిపించని క్యారెక్టర్లో చిట్టిబాబు కనిపించాడే తప్ప.. రామ్ చరణ్ అగుపించలేదన్నది అందరి మాట!
నటనలో రామ్ చరణ్ కు ఎంతటి ప్రశంసలు తెచ్చిందో.. నిర్మాతకు అంతే మొత్తం కలెక్షన్లు మోసుకొచ్చిందీ చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన అద్భుత 'రంగస్థల' నాటకాన్ని.. తమిళ తెరపై ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ఈ డబ్బింగ్ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు పంపిణీదారు 7జీ ఫిలిమ్స్ శివ.
అయితే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. తమిళనాట కూడా థియేటర్లపై ఆంక్షలు విధించారు. అక్కడ ఎప్పటి నుంచో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లో ఉంది. దీంతో.. పెద్ద చిత్రాలు విడుదల కావట్లేదు. చిన్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో.. డబ్బింగ్ కేటగిరీలో విడుదలవుతున్న 'రంగస్థలం' ప్రదర్శనకు ఇదే సరైన సమయం అని భావించి, రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా.. ఇవాళ సాయంత్రం 5 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి.. ఇలాంటి చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియలిస్టిక్ గా ఉండే చిత్రాలను వారు ఎక్కువగా అభిమానిస్తుంటారు. మరి, ఈ సినిమా అక్కడ ఎలాంటి రిజల్ట్ నమోదు చేస్తుందో చూడాలి.