సుంద‌రం మొక్కిందోటి.. ద‌క్కిందోటి

Update: 2022-05-23 10:56 GMT
నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న రోమ్ - కోమ్ ఎంట‌ర్ టైన‌ర్ `అంటే సుంద‌రానికి`. గ‌త ఏడాది రెండు విభిన్న‌మ‌బైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాని ఈ ఏడాది కూడా అదే పంథాలో రెవండు వైవిధ్య‌మైన‌ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ముందుగా రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన `అంటే సుంద‌రానికి` ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు.

మ‌ల‌యాళ క్రేజీ హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌క‌లుకు ప‌రిచ‌యం అవుతోంది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ మూవీ ఇప్ప‌డికే మంచి బ‌జ్ ని క్రియేట్ చేసింది. న‌రాని లుక్‌, రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియోస్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

నాని న‌టించిన ఇటీవ‌ల చిత్రాలు సూప‌ర్ హిట్ లుగా నిల‌వ‌డం, తొలి సారి రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రోమ్ కామ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తాజా మూవీని చేయ‌డం, నాని లుక్ కొత్త‌గా వుండ‌టం తో ఈ మూవీని ప్ర‌త్యేకంగా చూస్తున్నారు.

ఇప్ట‌పికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని జూన్ 10న భారీ స్థాయిలో క‌న్న‌డ‌, హిందీ మిన‌హా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేసింది. ఇప్ప‌టికే రెండు లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ సోమ‌వారం ఈ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ గా `రంగా రంగా ` అంటూ సాగే సాంగ్ ని విడుద‌ల చేశారు.

వివేక్ సాగ‌ర్ సంగీతం అందించ‌గా కారుణ్య ఈ పాట‌ని అద్భుతంగా ఆల‌పించారు. సానాప‌తి భ‌ర‌ద్వాజ్ పాత్రుడు సాహిత్యాన్ని అందించారు. పాథ‌టిక్ సిట్యువేష‌న్ నేప‌థ్యంలో ఈ పాట‌ని నానిపై చిత్రీక‌రించారు. ఈ పాట‌లో  `మొక్కిందోటి.. ద‌క్కిందోటి ..ఇన్నోటి నోడించి ఇస్తార్నే లాగేస్తారా? .. అంటూ ర‌చ‌యిత వాడిన ప‌దాలు ఆక‌ట్టుకుంటున్నాయి. సాంగ్ విజువ‌ల్స్ కూడా ఫ‌న్ ని జ‌న‌రేట్ చేసేవిగా వుంటూ న‌న్వు పుట్టిస్తున్నాయి.  

ముందు విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు మించి తాజాగా విడుద‌ల చేసిన పాట చాలా భిన్నంగా వుంది. నికేత్ బొమ్మి ఛాయాగ్ర‌హ‌ణం, ర‌వితేజ గిరిజాల ఎడిటింగ్ అందిస్తున్నారు. త‌మిళంలో `అడ‌డే సుంద‌ర‌`గా, మ‌ల‌యాళంలో `ఆహా సుంద‌ర‌`గా ఈ మూవీని తెలుగుతో పాటు జూన్ 10న విడుద‌ల చేస్తున్నారు.


Full View
Tags:    

Similar News