భార్య సేవలో తరిస్తున్న స్టార్ హీరో

Update: 2020-05-26 12:10 GMT
వరుస హిట్స్ తో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇప్పుడు తన భార్య, హీరోయిన్ దీపికా పడుకొణే సేవలో తరిస్తున్నాడు. ఆమె ఏం చెప్పినా చేస్తున్నాడట.. ఆమెకు అసిస్టెంట్ గా మారిపోయాడట.. ఈ మహమ్మారి లాక్ డౌన్ తో దొరికిన ఖాళీ సమయంలో దీపికతో కలిసి రణవీర్ సింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన స్టార్ బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పడుకొణే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తమ ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. తరుచుగా లైవ్ లోకి వస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన రణవీర్ తన భార్య దీపిక పడుకొణే వంట గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. తాను కాలేజీ రోజుల్లో బటర్ చికెన్ బాగా చేసే వాణ్ని అని.. రెడీ మేడ్ ప్యాకేట్స్ ఎక్కువగా వాడేవాడినని.. కానీ ఇప్పుడు నా భార్య దీపిక నాకంటే చాలా బాగా వంట చేస్తుందని వివరించాడు. దీపికకు వంట చేయడం ఇష్టమని.. వంటగది బాధ్యతలు కూడా తనే తీసుకుందని రణవీర్ వివరించాడు. నేను ఆమెకు గొప్ప అసిస్టెంట్ గా ఉంటాను అని వివరించాడు. వంట గదిలో ఆమెకు సాయం చేస్తున్నానని రణవీర్ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News