బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలు ఈనెల 14 - 15న ఇటలీలోని ఒక ఐలాండ్ లో అత్యంత వైభంగా వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగినట్లుగా తెలుస్తోంది. మొదట సౌత్ ఇండియన్ కొంకణి సాంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ కుటుంబంకు చెందిన సింధ్ ఆచారం ప్రకారం జరిగింది. రెండు రోజులు అతి కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. వీరి వివాహంకు సంబంధించి కేవలం రెండు ఫొటోలు మాత్రమే మీడియాకు బయటకు వచ్చాయి.
ఆ రెండు ఫొటోల్లో ఒక ఫొటోలో దీపిక పదుకునే చేతికి పు రింగ్ లు పెట్టుకుని కనిపిస్తుంది. అందులో పెద్దగా కనిపించే రింగ్ అత్యంత ఖరీదైన రింగ్ గా బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. 1.5 నుండి 2.5 కోట్ల వరకు ఆ రింగ్ ఖరీదు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు దక్కించుకున్న వీరిద్దరి వివాహం అత్యంత ఖరీదుతో జరిగింది. అలాంటప్పుడు రెండు కోట్ల రింగ్ ను దీపిక ధరించడంలో పెద్ద వింతేం ఉంది అంటూ కొందరు అంటున్నారు. చేతికి ఇంకా రింగ్ లు ఉన్నా కూడా డైమండ్స్ పొదిగి ఉన్న ఆ రింగ్ స్పష్టంగా - అందంగా కనిపిస్తూ దీపిక అందంను మరింతగా అందంగా మార్చిందనిపిస్తుంది. ఈ నూతన జంటకు బాలీవుడ్ నుండే కాకుండా రాజకీయ మరియు వ్యాపార ప్రముఖుల నుండి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి.