పుట్టింది చంప‌డానికి! ర‌ణ‌వీర్ ఫిలాస‌ఫీయే వేరు!!

Update: 2021-11-01 23:30 GMT
బార్న్ టు కిల్ .. బిల్ట్ టు లాస్ట్..!! ర‌ణ‌వీర్ బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. లైఫ్ జ‌ర్నీలో ఎలాంటి పోరాటానికైనా త‌న‌ని తాను సిద్ధంగా ఉంచుకున్న‌ప్పుడే ఎలాంటి స్ట్ర‌గుల్ ని అయినా అధిగ‌మించ‌గ‌ల‌మ‌నేది ర‌ణవీర్ సింగ్ ఫిలాస‌ఫీ. బాలీవుడ్ లో ఆరంభ‌మే పాము - నిచ్చెన‌ల ఆట‌లో రాటు దేలిన ఈ యువ ప్ర‌తిభావంతుడు .. అక్క‌డ కంచె వేసిన‌ ఆ న‌లుగురి మెప్పు పొందాడు. ఆ క్ర‌మంలోనే త‌న ఆట‌కు ఎదురే లేకుండా తెలివిగా పావులు క‌దిపాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి ప్ర‌తిభావంతుడు ముక్కు సూటిగా వెళ్లి కెరీర్ ని నాశ‌నం చేసుకుంటే .. గాలి వాటుగా ర‌ణ‌వీర్ ఎత్తుగ‌డ‌ల‌తో ఎదిగాడ‌ని చెబుతుంటారు. ఏదేమైనా కానీ .. బార్న్ టు కిల్.. బిల్ట్ టు లాస్ట్. ఇప్పుడున్న సంఘంలో ఇలాంటి ఒక ఫార్ములా లేక‌పోతే ముందుకు వెళ్ల‌డం అసాధ్యం అని అత‌డు చెబుతున్న‌ట్టే అనిపిస్తోంది.

ఇటీవ‌ల తాను న‌టించిన 83 లాంటి సినిమా రిలీజ్ కి రావ‌డం లేదు. క్రైసిస్ వ‌ల్ల అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. ఈ చిత్రానికి త‌న భార్య దీపిక ప‌దుకొనే ఒక పెట్టుబ‌డి దారు. ఇక 83 చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు నిర్మాత‌లు. డిసెంబ‌ర్ 24న ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల‌వుతోంది. త్వ‌రలోనే ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌నున్నారు.

తాజాగా ర‌ణ‌వీర్ సింగ్ జిమ్ లో తీవ్రంగా శ్ర‌మిస్తున్న ఫోటోల‌ను షేర్ చేసి దానికి బార్న్ టు కిల్ .. బిల్ట్ టు లాస్ట్ ! అనే ట్యాగ్ లైన్ ని జోడించారు. అత‌డు జిమ్ లో ఎంత‌గా చెమ‌టోడుస్తున్నాడో ఈ ఫోటోల బంచ్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఫిట్నెస్ ప‌రంగా రాజీ అన్న‌దే లేకుండా ర‌ణ‌వీర్ శ్ర‌మిస్తున్నాడన‌డానికి ఈ ఫోటోలే సాక్ష్యం. ఇక నిరంత‌రం తీవ్ర‌మైన పోటీ ఉండే బాలీవుడ్ లో హీరోలంతా ఎంత‌గా శ్ర‌మిస్తారో చూస్తున్న‌దే. ఇక ర‌ణ‌వీర్ త‌న‌దైన ఎన‌ర్జీతో అంద‌రికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ర‌ణ‌వీర్ న‌టించిన జ‌యేష్ భాయ్ జోర్ధార్.. రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ క‌హానీ.. సిర్క‌స్ చిత్రీక‌ర‌ణ‌ల్లో ఉన్నాయి. త్వ‌ర‌లో ఇవ‌న్నీ రిలీజ్ కి రావాల్సి ఉంది.
Tags:    

Similar News