ఇండియన్ సిల్వర్ స్క్రీన్ హిస్టరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా తెరకెక్కి సంచలనం సృష్టించిన భారీ బడ్జెట్ చిత్రం పద్మావతి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. కొన్ని హిందు వర్గాల నుండి చిత్ర యూనిట్ కు ఎన్నో వార్నింగ్ లు అందాయి. కొన్ని దాడులు కూడా జరిగాయి. సినిమా 2017 డిసెంబర్ లోనే రిలీజ్ కావాలి. కానీ కొందరు సినిమా సెన్సార్ ని కూడా జరగనివ్వలేదు.
అయితే ఎట్టకేలకు కొంతమంది సెన్సార్ సభ్యుల చొరవతో దర్శకనిర్మాతలు కొన్ని షరతులకు ఒప్పుకొని సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. కొన్ని డైలాగులను సీన్స్ ను అలాగే టైటిల్ లో కూడా మార్పులు చేసి సెన్సార్ సర్టిఫికెట్ ని పొందారు. ఫైనల్ గా పద్మావత్ గా ఆ సినిమా జనవరి 25 రిలీజ్ కాబోతోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చరిత్రాత్మక కథ కావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. 2D 3D వెర్షన్ లో ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుందని సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్న హీరో రన్ వీర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
అంతే కాకుండా తాను సినిమాలో చేస్తోన్న సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ తాలూకు స్టిల్ ని కూడా షేర్ చేశాడు. దీంతో తెలుగు ఫ్యాన్స్ కి రన్ వీర్ మంచి కిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమిళ్ లో కూడా ఈ హిస్టారికల్ మూవీ రిలీజ్ కానుంది. అయితే తమిళ్ పోస్టర్ ని మాత్రం చిత్ర కథానాయిక దీపిక పదుకొనె రిలీజ్ చేసింది. సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ఈ సినిమా మొత్తానికైతే విడుదల అవుతోంది. మరి ఎంతవరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి.