30 నిముషాలకు 2 కోట్లు వద్దనేసాడు

Update: 2018-02-13 13:14 GMT
స్టార్ హీరోలు మూసలో కొట్టుమిట్టాడుతుంటే బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ మాత్రం కొత్త దారిలో వెళ్తున్నాడు. హీరో పాత్రలు ఒప్పుకుంటూనే విభిన్నంగా అనిపించే ఏ ఆఫర్ ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే సంజయ్ లీలా భన్సాలీ అంతటి దర్శకుడు వరసగా మూడు సినిమాలు ఇతనితోనే చేసేంతలా టాలెంట్ చూపించుకున్నాడు. నాలుగోది కూడా చర్చల్లో ఉందని టాక్. ఇక పద్మావత్ సినిమాలో అల్లాయుద్దిన్ ఖిల్జీగా రన్వీర్ సింగ్ నటన విమర్శకులతో కూడా ప్రశంశలు అందుకునేలా చేసింది. ఇప్పటికే ఉన్న స్టార్ డం ఆ పాత్ర ద్వారా రెట్టింపు అయ్యింది కూడా. అందుకే తన కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న రన్వీర్ సింగ్ తలుపు తట్టి మరీ పిలిచిన ఒక బంగారం లాంటి ఆఫర్ ని వద్దనుకోవడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

ఒక ప్రముఖుడి ఇంట డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అరగంట పెర్ఫార్మన్స్ ఇవ్వమనే ఆఫర్ రన్వీర్ సింగ్ కు వచ్చింది. అందుకు గాను అక్షరాలా రెండు కోట్ల రూపాయలు సమర్పించుకుంటామని కూడా చెప్పారట. సాధారణంగా షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం ఇలాంటి వాటిలో స్టేజి షోలు చేస్తుంటారు. కాని రన్వీర్ మాత్రం చేయను పొండి అనేసాడట. కారణం తాను ప్రస్తుతం నటిస్తున్న గల్లీ బాయ్ కోసం ప్రత్యేక గెటప్ లో ఉంటూ శరీరం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రన్వీర్ ఇప్పుడు ఆ షో కోసం మేకప్ వేసుకుని రెస్ట్ లేకుండా ఆడిపాడితే తిరిగి షూటింగ్ కు వచ్చాక అది ప్రభావం చూపించవచ్చు అని అలోచించి వద్దనుకున్నట్టు టాక్.

ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. కోరినంత రెమ్యునరేషన్ ఇస్తే చాలు ఎక్కడైనా ఆడిపాడేందుకు తారలు సిద్ధ పడుతున్న ట్రెండ్ లో కోరి కాళ్ళ దగ్గరికి వచ్చిన ఇలాంటి ఆఫర్ ను వద్దనుకోవడం నిజంగా అతని కమిట్మెంట్ ని సూచిస్తోంది. దీపికా పదుకొనేతో డీప్ లవ్ లో ఉన్నాడనే వార్తల నేపధ్యంలో ఈ ఇద్దరికీ త్వరలో పెళ్లి కూడా జరగబోతోంది అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News