ఆ పెళ్ళిళ్ళతో బాలీవుడ్ కి పండగ!

Update: 2018-12-03 09:58 GMT
పెళ్ళంటేనే సందడి. ఎవరైనా పెళ్ళి చేసుకుంటున్నారంటే వాళ్ళింట్లోనే కాకుండా వారి సన్నిహితుల ఇళ్ళలో కూడా సందడి నెలకొంటుంది. ఇక స్టార్లు పెళ్ళికి రెడీ అయితే మీడియాలో కూడా సందడే. వారి పెళ్ళి ఎక్కడ జరుగుతుంది..ఏ స్టైల్ లో జరుగుతుంది.. ఎంత ఖర్చు.. ఏ డ్రెస్ లు వేస్తుకుంటారు.. ఆభరణాలు ఎలాంటివి.. పెళ్ళి కార్డు ఎలా ఉంటుంది.. అతిథులు ఎవరు.. ఇలా అన్నీ విశేషాలే.   రీసెంట్ గా బాలీవుడ్ స్టార్లు దీపిక పదుకొనె - రణవీర్ సింగ్ ల వివాహం చేసుకున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ ల కళ్యాణం జరిగింది.

ఇక నవంబర్ అంతా ఈ విషయాలే హాట్ టాపిక్ లు.  ఇప్పటికీ ఇవే ఫిలిం న్యూస్ హెడ్ లైన్స్.  వీరి పెళ్ళిళ్ళతో బాలీవుడ్ కు సందడి వచ్చింది.  ఎందుకంటే పెళ్ళి అంటే ఒక్కరోజులో అయిపోతుందని అనుకుంటారు గానీ సెలెబ్రిటీల వివాహాలు అలా జరగడం లేదు.  బ్యాచిలర్ పార్టీలు.. బ్రైడల్ షవర్ ఫంక్షన్లు.. సంగీత్.. మ్యారేజ్ పార్టీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ పార్టీలు. ఇంతటితో ఆగదు. రిసెప్షన్లు ఒకటి కాదు.. ఒక్కో ఊర్లో ఒక్కో రిసెప్షన్ జరుగుతుంది. దీప్-వీర్ ల రిసెప్షన్లు .. ఆఫ్టర్ వెడ్డింగ్ పార్టీలు ఇప్పటికే మూడో నాలుగో జరిగాయి. ఇక దీపిక స్టైల్ లోనే  ప్రియాంక వివాహం కూడా రెండు సార్లు.. రిసెప్షన్లు కూడా రెండు సార్లు.
 
దీంతో బాలీవుడ్ ప్రముఖులు తప్పనిసరిగా ఈ పార్టీలకు.. ఫంక్షన్లకు డిజైనర్ వేర్ కాస్ట్యూమ్స్ లో హాజరవుతూ ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. నెల నుండి జరుగుతున్న హంగామా ఇప్పుడు ప్రియాంక పెళ్ళి తో పీక్స్ లో కి చేరింది. ఇక ఈ హంగామా ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఎందుకంటే.. ప్రియాంక ఢిల్లీ.. ముంబై రిసెప్షన్లు ఇంకా జరగాల్సి ఉంది.  ఈ హంగామా చూస్తుంటే క్రిస్మస్ .. న్యూ ఇయర్ వరకూ ఈ సెలబ్రేషన్ కంటిన్యూ అయ్యేలా ఉంది.

   

Tags:    

Similar News