ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి సంపాదన ఎక్కువగా ఉంటుంది? అని అడిగితే ఎక్కువమంది వెంటనే స్టార్ హీరోల పేర్లు చెప్తారు. లేకపోతే స్టార్ డైరెక్టర్ల పేర్లు చెప్తారు. నిర్మాతల పేర్లు ఒక్కరు కూడా చెప్పరు లెండి. ఎందుకనేది అందరికీ తెలిసిందే. ఇక కమెడియన్ల పేర్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు కూడా చెప్పరు.. ఎందుకంటే కమెడియనే కదా.. క్యారెక్టర్ ఆర్టిస్టే కదా అనే తేలిక భావం ఉంటుంది. కానీ వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. ఎంతో మంది హీరోల కంటే మనం చెప్పుకాబోయే ఇద్దరు ఎక్కువ సంపాదిస్తున్నారట.
వారెవరో కాదు.. వెన్నెల కిషోర్.. రావు రమేష్. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ అయితే.. టాప్ లీగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్. ఇప్పుడు హీరోల కంటే వీరి డేట్స్ సంపాదించడమే ఫిలిం మేకర్లకు కష్టంగా ఉందట. సినిమాను ఒంటి చేత్తో హ్యాండిల్ చెయ్యగలగడం ఈ ఇద్దరి ప్రత్యేకత. ఈమధ్య రిలీజ్ అయిన 'ప్రతిరోజూ పండగే' సినిమాలో హీరో తేజు పాత్ర కంటే రావు రమేష్ పాత్ర హైలైట్ అయిన సంగతి తెలిసిందే. వెన్నెల కిషోర్ కూడా అంతే.. సరైన పాత్ర పడితే తనదైన శైలిలో చెలరేగిపోతాడు. రావు రమేష్ లాగా సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. అందుకే వెన్నెల కిషోర్.. రావు రమేష్ పారితోషికం కూడా అదే స్థాయిలో ఉందని అంటున్నారు. ఒక రోజు కాల్ షీట్ కు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటారట.
ఈ స్థాయిలో సినిమాకు ప్లస్ గా మారే నటులు టాలీవుడ్ లో చాలా తక్కువమంది ఉండడంతో ఫిలిం మేకర్స్ కూడా పట్టుబట్టి మరీ వీరిని తీసుకుంటున్నారట. ఈమధ్య కమెడియన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంచెం గుర్తింపు రాగానే హీరోలుగా మారుతున్నారు.. మాస్ హీరోలుగా ఊహించుకుంటూ తమ మార్కెట్ ను తామే చేజేతులా పాడు చేసుకుంటున్నారు. కానీ వెన్నెల కిషోర్.. రావు రమేష్ మాత్రం అలా చెయ్యకుండా తమ పాత్రలకు న్యాయం చేస్తూ తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు.